Home / MOVIES / గ్రీన్ ఇండియాలో మహేష్ బాబు

గ్రీన్ ఇండియాలో మహేష్ బాబు

తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత.

అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు.

యన్టీఆర్, విజయ్, శ్రుతీహాసన్‌లకు గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ను విసిరారు మహేశ్‌బాబు.