తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017 జూన్ నాటికి ప్రభుత్వ దవాఖానల్లో 35 శాతం ఉన్న ప్రసవాలసంఖ్య 62 శాతానికి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సిజేరియన్ల సంఖ్య 80 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ల పథకంతో తల్లీ, బిడ్డ దవాఖాన నుంచి క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు. దిగ్విజయంగా అమలవుతున్న కేసీఆర్ కిట్ల పథకానికి జాతీయస్థాయిలో ప్రశంసలు …
Read More »ప్రారంభించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఇవాళ నానక్‌రాంగూడలోని విప్రో సర్కిల్‌లో ఉన్న వంశీరామ్స్ ఐటీ పార్కులో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా రానున్న 3 ఏళ్ల …
Read More »వరికోల్ గ్రామ ప్రజానీకానికి ఎమ్మెల్సీ పోచంపల్లి పిలుపు
త్వరలో రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి ప్రతిమలను వాడాలని వరికోల్ గ్రామ ప్రజానీకానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మట్టి ప్రతిమల వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. అందరూ కలిసి సమిష్టిగా గ్రామంలో ఒకే వినాయకుడిని ప్రతిష్టించుకొని పూజించాలని కోరారు. దీని ద్వారా వరికోల్ ప్రజల ఐక్యతను చాటిచెప్పాలని అన్నారు. రసాయన రంగులు వాడి తయారుచేసే …
Read More »స్వరాష్ట్రంలో సర్కారీ విద్యలో వెలుగులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పాఠశాల విద్యాశాఖలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో చేపట్టిన హాజరు మాసోత్సవంతో మంచి ఫలితం కనిపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, ప్రాధాన్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు కూడా ముందుకువస్తున్నారు. …
Read More »సోషల్‌మీడియాను ఊపేస్తున్న కేటీఆర్ అరుదైన ఫోటో…!
రాజకీయాలతో పాటు, సోషల్ మీడియాలో బిజీగా ఉండే అతి కొద్ది మంది నేతల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ…తమకు ఫలానా ఆపద ఉంది..కాపాడండి అనే వారి ట్వీట్లకు వెంటనే రియాక్ట్ అయి…ఆపన్నులకు సాయం చేసే ఏకైక నేత..కేటీఆర్. అయితే అప్పుడప్పుడు తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు కేటీఆర్. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన ఓ …
Read More »తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం.
తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం… పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేపట్టిన కార్యాచరణ అమలుకు వేగంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ‘ 60 రోజుల ప్రణాళిక’ అమలు కోసం అన్ని విధాలుగా సిద్థంగా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా …
Read More »వచ్చే వర్షాకాలంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు..!
తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు …
Read More »నీటివనరుల పునరుద్ధరణలో తెలంగాణ దేశంలోనే టాప్
తెలంగాణలోని 46 వేల చెరువులను పునరుద్ధరించి, 20 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ మొదలుపెట్టింది. చిన్నతరహా నీటివనరులను బలోపేతం చేయడం, నీటి యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించడం, చెరువులను పునరుద్ధరించడం, కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో చిన్నతరహా సాగునీటి రంగానికి కేటాయించిన 255 టీఎంసీలను సమర్థంగా ఉపయోగించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. 2018 మార్చినాటికి 22,500 చెరువులు పునరుద్ధరించారు. దీనివల్ల చెరువుల్లో నీటి …
Read More »సంగారెడ్డికి పోషణ్ అభియాన్ అవార్డు
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు పోషణ్ అభియాన్ అవార్డు వరించింది. జిల్లాలో పోషణ్ అభియాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా సంగారెడ్డిని ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఇవాళ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ …
Read More »తెరపైకి గోదావరి-కావేరి అనుసంధానం
దేశంలో ప్రధాన నదులైన గోదావరి- కావేరి అనుసంధాన ప్రాజెక్టును కేంద్రం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మొత్తం మూడు ప్రతిపాదనలను తెలంగాణ ముందుంచింది. గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనలతోపాటు తెలంగాణ సూచించిన మార్పులకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రతిపాదనలనూ ప్రస్తావించింది. జానంపేట నుంచి దుమ్ముగూడెం.. మణుగూరు బొగ్గు గనులను అనుసరిస్తూ.. హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ మీదుగా …
Read More »