కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వస్త్రాలపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని లేఖలో కోరిన ఆయన.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలన్నారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందన్న మంత్రి కేటీఆర్ కోట్లాది మంది చేనేతల జీవితాలు దెబ్బతింటాయన్నారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్న మంత్రి.. రైతుల మాదిరిగా నేతన్నలు కూడా కేంద్రంపై తిరగబడతారన్నారు.
Read More »సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి KTR సెటైర్స్
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 75కే చీప్ లిక్కర్, ఇంకా కుదిరితే రూ.50కే ఇస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘వావ్… ఏమి పథకం! ఎంత అవమానకరం. ఏపీలో బీజేపీ మరింత దిగజారింది’ అంటూ ఎద్దేవా చేశారు. చీప్ లిక్కర్ను రూ.50కే సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానమా? లేక నిరాశ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనా ఈ బంపర్ …
Read More »మల్లన్నపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ లో కేసు నమోదైంది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదైంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పీఎస్ లో తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.
Read More »అందుబాటులోకి హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.ఎస్ఆర్డీపీ లో భాగంగా ఒవైసీ-మిథాని జంక్షన్లో రూ.80కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ఉ.10.30లకు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ కంచన్ బాగ్ ని పిసల్బండ్ డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ మీదగా ఎల్బీ నగర్ వరకు వెళుతుంది. దీంతో ఎస్ఆర్డీపీలో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వంతెనల సంఖ్య 13, అండర్పస్ …
Read More »నేటి నుండి రైతుబంధు సాయం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం అమలులో భాగంగా 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమ చేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ, 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈసారి 66,61,638 మంది రైతులకు లబ్ధి …
Read More »తెలంగాణ రైతాంగానికి మంత్రి సింగరెడ్డి విన్నపం
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వలపుబాణాలు విసురుకొంటున్నాయని విమర్శించారు. విత్తనాలకోసం, ఇంటి అవసరాల కోసం మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే వారి వేసుకోవచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్కు భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చని మంత్రి సూచించారు.
Read More »ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27, యాదాద్రిలో 23, భూపాలపల్లిలో 12 కుటుంబాలకు పరిహారం రిలీజ్ చేశారు.
Read More »ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
దేశంలోనే తొలి ఐఏఎంసీ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్పగించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఐఏఎంసీ ఏర్పాటు …
Read More »జీహెచ్‌ఎంసీ అప్రమత్తం-GHMC సర్కిళ్లలో ఐసొలేషన్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే కాలనీల వారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతూ మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అంతేకాకుండా 2173 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రసాయనాలు స్ప్రే చేశారు. పాజిటివ్ నమోదవుతున్న ప్రాంతాలు, …
Read More »హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి KTR
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మరో 248 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్‌లో నిర్మించిన 248 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. చాచా నెహ్రూనగర్‌లోని 3.35 ఎకరాల్లో రూ.19.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను నిర్మించారు. మౌలిక వసతులతో పాటు 50, 20 …
Read More »