ఓ పెళ్లి వేడుకలో పీటలపైనే పెళ్లికుమార్తె కళ్లు తిరిగిపడిపోయి ఆపై మృతిచెందిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాజీ అనే యువకుడికి సృజన అనే యువతితో బుధవారం మధురవాడలో పెళ్లికి నిర్ణయించారు. పెళ్లి పీటలపై సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో సృజన ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం సృజన చనిపోయింది. …
Read More »