Breaking News
Home / ANDHRAPRADESH / పెళ్లిపీటలపై కళ్లు తిరిగిపడిపోయి.. ఆపై చనిపోయిన వధువు

పెళ్లిపీటలపై కళ్లు తిరిగిపడిపోయి.. ఆపై చనిపోయిన వధువు

ఓ పెళ్లి వేడుకలో పీటలపైనే పెళ్లికుమార్తె కళ్లు తిరిగిపడిపోయి ఆపై మృతిచెందిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాజీ అనే యువకుడికి సృజన అనే యువతితో బుధవారం మధురవాడలో పెళ్లికి నిర్ణయించారు. పెళ్లి పీటలపై సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో సృజన ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం సృజన చనిపోయింది.

అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. వధువు విషాహారం తిని సూసైడ్‌ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇష్టంలేని పెళ్లి కారణంగా సృజన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వధువు బ్యాగ్‌లో గన్నేరుపప్పు గుర్తించిన నేపథ్యంలో ఆమె అది తిని సూసైడ్‌ చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino