Home / Tag Archives: medaram

Tag Archives: medaram

శభాష్ తెలంగాణ పోలీస్

దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ …

Read More »

పుణె మహిళ మగశిశువుకు జన్మ.. కేసీఆర్‌ కిట్‌ అందజేత..

మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ మహిళ మేడారంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జాతరకు మూడురోజుల క్రితం చవాన్‌ శివాని, గోవిందర్‌ కుటుంబం మేడారం చేరుకొన్నారు. గర్భిణి అయిన శివానితో కలిసి కుటుంబసభ్యులు గురువారం ఉదయం వనదేవతలను దర్శించుకొన్నారు. అంతలోనే నొప్పులురావడంతో శివానీని దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు శివానీకి సాధారణ ప్రసవం చేశారు. ఉదయం 11.48 గంటలకు శివానీ మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు మూడున్నర కిలోల బరువుతో ఆరోగ్యంగా జన్మించాడు. …

Read More »

వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. …

Read More »

మేడారం జాతర జనసంద్రం

తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర ఎంతో ఘనంగా ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారానికి భక్తులు,ఆశేష జనసందోహాం తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈరోజు రేపు భారీగా భక్తులు తరలివస్తారని భావించిన అధికారులు దానికితగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్,గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈ రోజు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.రేపు శనివారం …

Read More »

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. …

Read More »

చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క

మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి  సమ్మక్క మేడారంలోని గద్దె పైకి  బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి  సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు  పూజారులు తీసుకుని వస్తున్నారు …

Read More »

సమ్మక్క దేవతగా ఎలా మారింది..?

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. అయితే సమ్మక్క దేవతగా ఎలా మారిందో తెలుసుకుందాము.. గిరిజన రాజ్యంలో సమ్మక్క అపురూపంగా పెరుగుతుంది. సమ్మక్క ఎవరికి ఏ ఆపద వచ్చిన సరే తన చేతి స్పర్షతో ఆ ఆపదను మటుమాయం చేసేది. ఏ కష్టం చెప్పుకున్న కానీ ఆ కష్టాన్ని సమ్మక్క తీర్చేది. అలా అత్యంత …

Read More »

మేడారం జాతరను ఎవరు ప్రారంభించారు..?

ఆసియా ఖండంలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర. ఈ జాతరలో సుమారుగా రెండు కోట్లకు పైగా ప్రజలు,భక్తులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి పాల్గొంటారు. అయితే అసలు మేడారం జాతర ఎప్పుడు మొదలైంది..?. ఎవరు ప్రారంభించారు..?. ఎందుకు ప్రారంభించారో తెలుసుకుందాము.. యుద్ధానికి వ్యతిరేకంగా తమ సైనికులు చేసిన తప్పిదాన్ని గ్రహించిన ప్రతాప రుద్రుడు పశ్చాతాపానికి గురవుతాడు. దీంతో మేడారాన్ని చేరుకుని కోయలకు క్షమాపణ చెప్తాడు. మేడారాన్ని తిరిగి కోయలకు …

Read More »

మేడారం జాతరలో ఏ రోజు ఏమి జరుగుతుంది..?

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం దేవతలను వనాల్లోకి …

Read More »

మేడారం జాతర గురించి ఆకాశవాణి ఏమి చెప్పింది..?

సమ్మక్క కోసం కోయలు వెతుకుతుంటారు. నెమలి చార చెట్టు దగ్గరున్న పుట్ట వద్ద కుంకుమన్ భరణి కన్పించింది. అదే సమ్మక్క ఆనవాలుగా కోయలు భావిస్తారు. అలా భావించి ఎదురు చూస్తుండగా కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఆ స్థలంలో గద్దె కట్టించాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరపాలి. అలా జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయి …

Read More »