మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దె పైకి బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు.
ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు పూజారులు తీసుకుని వస్తున్నారు .ఎమ్మెల్యేలు సీతక్క,పొందేం వీరయ్య, ఇంచార్జి కలెక్టర్ కర్ణన్,మంత్రులు దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, జడ్పి చైర్మన్ జగదీష్, ఎమ్మెల్యే నరేందర్ మేడారానికి బయల్దేరిన ఆ తల్లికి స్వాగతం పలికారు.
మహిళ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివాసీ కళాకారులతో కలసి నృత్యాలు చేశారు. సమ్మక్క వచ్చే మార్గంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మేడారం గద్దెల వద్ద భక్తుల తాకిడిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.