Home / Tag Archives: Minister for Finance (page 9)

Tag Archives: Minister for Finance

బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది- మంత్రి సత్యవతి రాథోడ్

దేశంలో గిరిజనులు, దళితులకు మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ములుగులో ట్రైబల్ వర్సిటీని ఇంతవరకు కేంద్రం నిర్మించలేదని తెలిపారు. పోడు భూముల సమస్యపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.

Read More »

తెలంగాణలో ఆ ధరలను తగ్గించాలి

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టుల ధరలను తగ్గించింది. గతంలో రూ.499గా ఉన్న కరోనా టెస్టు ధరను రూ.350కి తగ్గించింది. దీంతో తెలంగాణలో కూడా ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కాగా తెలంగాణలో కరోనా టెస్టుల కోసం కొన్ని ల్యాబ్లో రూ.500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,20,215 కరోనా పరీక్షలు చేయగా.. 4,207 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.75శాతంగా ఉంది.

Read More »

రైల్వే లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం

రైల్వే లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోదక్కుమార్ అన్నారు. ‘రాష్ట్రానికి రైల్వే లైన్లు మంజూరు చేయాలి. తెలంగాణ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దేశంలోని పలు ప్రాంతాల నుంచి TSకు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త రైల్వే లైన్లు అవసరం’ అని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు …

Read More »

తెలంగాణలో నేటి నుండి ఫీవర్‌ సర్వే

తెలంగాణ రాష్ట్రంలో  శుక్రవారం నుండి ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. ఆరోగ్య సిబ్బందికితోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఫీవర్‌ సర్వేలో పాల్గొంటారన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు.లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్‌ …

Read More »

తెలంగాణలో కరోనా ఆంక్షలు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. …

Read More »

డీఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్లో జమ కానుండగా.. 2021 జూలై నుంచి బకాయిలు జీపీఎఫ్ ప్రభుత్వం జమ చేయనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More »

తెలంగాణలోని సర్కారు బడులకు మహర్ద

తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నది.. ఇందుకోసం రూ.7,289 కోట్లు కేటాయించనున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో రూ.7,300కోట్లతో మౌలిక వసతులు కల్పన ..మన ఊరు -మన బడి విధి విధానాలతో మారనున్న ప్రభుత్వ స్కూళ్లుఈ పథకంలో భాగంగా మూడేండ్లలో …

Read More »

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఈరోజు వరంగల్ జిల్లాల్లో పర్యటించాలని నిన్న కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. ఇతర కారణాల వల్ల ఆ పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం జిల్లాలో పర్యటించి పంటపొలాలను పరిశీలించనున్నారు.

Read More »

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేస్తామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీపై కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు బదలాయింపును ఈ నెలలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ప్రభాకర్రావు హామీ ఇచ్చారు.

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat