దేశంలో గిరిజనులు, దళితులకు మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.
ములుగులో ట్రైబల్ వర్సిటీని ఇంతవరకు కేంద్రం నిర్మించలేదని తెలిపారు. పోడు భూముల సమస్యపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.