తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ,హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి పద్నాలుగు తారీఖున జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంచార్జులను నియమించారు. మహబూబ్ నగర్ జిల్లాకు ఇంచార్జ్ గా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు మంత్రి తన్నీరు …
Read More »సయ్యద్ అఫ్రీన్ను సన్మానించిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ యూనివర్సిటీ ద్వారా అతిచిన్న వయస్సులో తెలుగులో డాక్టరేట్ అందుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్ అఫ్రీన్ బేగంను ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. జ్ఞాపికను అందజేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో కవితను అఫ్రీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలుగు భాషా సాహిత్యం, రచనలపై పరిశోధనకుగాను ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది. ఒక ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమే కాకుండా కేవలం మూడేండ్లలోనే పీహెచ్డీ …
Read More »జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మరిన్ని అధికారాలు, నిధులు కల్పించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరారు టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు స్థానిక పరిపాలనలో మరింత భాగస్వామ్యం కల్పించడo, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు వంటి …
Read More »కాంగ్రెస్,బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్-స్వీకరిస్తారా..?
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ ,కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.వచ్చే నెల మార్చి పద్నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్. రామచందర్ రావు నామినేషన్ దాఖలు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ కుటుంబం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుందని. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరదలపై మూడేళ్ల క్రితమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశానని వెల్లడించారు.
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘కోటి వృక్షార్చన’ పోస్టర్ విడుదల
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న , రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ …
Read More »డీ రాజాకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ
ఇటీవల అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నగరంలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ నాయకులు ఆయన్ను కోఠీలోని కామినేని హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలో దవాఖానలో చికిత్స పొంతుదున్న ఆయనను ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో …
Read More »తెలంగాణ అసెంబ్లీలో మహాత్ముడికి ఘన నివాళులు
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహ్మాతుడి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన వారిలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, హోంమంత్రి మహముద్ అలీ గారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు గారు, నేతి …
Read More »అన్ని కులాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి/కుల్లె కడిగి/చిట్టెపు రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభా ఆదివారం జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు …
Read More »టీఆర్ఎస్ లోకి వలసలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు
Read More »