మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడమే మొహర్రం అని అన్నారు. మానవజాతిలో త్యాగం ఎంతో గొప్పదని , మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థమని అన్నారు. ఇస్లాంలో ముఖ్యమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం స్ఫూర్తిని అనుకరిద్దామని చెప్పారు సీఎం. త్యాగం, శాంతి, …
Read More »రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహించనున్నారు. డబీర్‌పురాలోని బీబీకా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు కొనసాగనుంది. ఈ సమయంలో ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Read More »మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం…సీఎం కేసీఆర్..!
నేడు మొహర్రం పండుగ.. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా మొహర్రం సంతాపదినాలు పాటిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా పీర్లను ఊరేగిస్తారు. బతుకమ్మ, బోనాల పండుగ లాగా…పీర్ల పండుగ కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రోజు మొహర్రం పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు తన సందేశాన్ని ఇచ్చారు. ” నేడు మొహర్రం పండుగ. …
Read More »