ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది రూ.3.07 కోట్లకు పెరిగింది. ప్రధాని వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంచారు.మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయనకు రూ.1.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మార్చి …
Read More »టోల్ రూపంలో నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం
ప్రతిష్టాత్మక ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి వస్తే టోల్ రూపంలో నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్స్ ప్రెస్ వేల వల్ల ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణ సమయం 24 గం. నుంచి 12 గం.కు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం టోల్ ఫీజుల ద్వారా NHAIకి ఏటా రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని, అది వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని …
Read More »ప్రధానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
Read More »గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
అంతా ఊహించినట్టుగానే గుజరాత్‌లో బీజేపీ హైకమాండ్ పటేల్ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ( Bhupendra Patel ) ఎంపికచేసింది. ఇవాళ గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ భూపేంద్ర పటేల్‌ను …
Read More »ఆస్తులు అమ్మి అచ్ఛేదిన్ అంటారా?
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా కొనసాగుతుందని చెప్పారు. దేశంలోని ప్రతి రంగంలో ప్రైవేటీకరణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదం.సహజ వనరులైన గనులు మొదలుకొని రోడ్లు, ప్రాజెక్టులు, కంపెనీలను అమ్మబోతున్నట్లు కేంద్రం ప్రకటించటం గర్హనీయం. ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వమూ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించలేదు, అమ్మకానికి పెట్టలేదు. …
Read More »ఎర్రకోట నుండి ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు
ఈరోజు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ …
Read More »ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన ప్రధాని మోదీ
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అజయ్‌భట్ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. …
Read More »కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి భేష్
ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణ తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అత్యుత్తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ, పుదుచ్చేరి రాష్ర్టాల పరిస్థితులను …
Read More »పెగాసస్ స్పైవేర్ పై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
పెగాసస్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వ్యక్తిగత విచారణ చేపట్టాలని, హ్యాకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను బహిర్గతం చేయాలని ఇప్పటి వరకు సుప్రీంలో 9 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటీషన్ వేసినవారిలో అడ్వాకేట్ ఎంఎల్ శర్మ, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, ద హిందూ గ్రూపు డైరక్టర్ ఎన్ రామ్, ఆసియానెట్ ఫౌండర్ శవి కుమార్, ఎడిటర్స్ గిల్డ్ …
Read More »కర్నాటక సీఎంగా బసవరాజు బొమ్మై ప్రమాణ స్వీకారం
కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ బసవరాజు బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో ఉన్న రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కర్నాటక రాష్ట్ర 23వ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. బసవరాజు బొమ్మై వయసు 61 ఏళ్లు. బీఎస్ యడియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. యెడ్డీలాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం …
Read More »