Home / Tag Archives: rahul gandhi

Tag Archives: rahul gandhi

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు-8మంది అరెస్ట్

గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మోదీ హటావో, దేష్ బచావో’ పేరుతో నిందితులు ఈ పోస్టర్లు ముద్రించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఇటీవల ఢిల్లీలోనూ ఈ తరహా పోస్టర్స్ గుర్తించిన అధికారులు.. 185 కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Read More »

రాహుల్ గాంధీపై ఈసీ అనర్హత వేటు

వయనాడ్ ఎంపీ ఎన్నికల్లో పోటీచేసి లెక్కలు సమర్పించని అభ్యర్థిపై ఈసీ అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై స్వతంత్ర అభ్యర్థి కే.ఇ రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2196 ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. కే.ఇ రాహుల్గాంధీ 2024 సెప్టెంబర్ 13వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఈసీ తాజాగా ప్రకటించింది.

Read More »

ఏప్రిల్ 8న తెలంగాణకు ప్రధాని మోదీ

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున తెలంగాణ పర్యటనకు రానున్నరు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వచ్చే ఏప్రిల్ 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ రానున్నట్లు వెల్లడించారు. మరోవైపు అదే రోజు సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు …

Read More »

కర్ణాటక ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే కన్నడిగుల తీర్పు పరిశీలిస్తే మాత్రం 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇచ్చిన సందర్భం లేదు. గత 38 ఏళ్లుగా అధికారం చేతులు మారుతూ వస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా లేక ఫుల్ స్టాప్ పడుతుందా వేచి …

Read More »

కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖాల్లో ఖాళీగా 9,79,327 పోస్టులు

కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అత్యధికంగా రైల్వేలో 2,93,943.. రక్షణ శాఖలో 2,64,706.. కేంద్ర హోంశాఖలో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర …

Read More »

సింగర్ గా అవతారమెత్తిన సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సింగర్ గా మారారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పాటను కూడా పాడారు. పక్కన మ్యూజిక్ ప్లే చేస్తుండగా సీఎం మమతా పాటను పాడటం ఆసక్తిగా మారింది. కొంతమంది కోరస్ ఇస్తుండగా సుమారు రెండు నిమిషాలపాటు బెంగాలీలో ఉన్న సాంగ్ను పాడారు. రాష్ట్రానికి నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలతో పాటు ఉపాధిహామీ పథకం నిధులు మంజూరు చేయడం …

Read More »

దేశంలో కొవిడ్ ఉద్ధృతి

దేశంలో తాజాగా కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,805 మంది కరోనా బారిన పడగా.. మరో ఆరుగురు వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మరోవైపు కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయికి చేరింది. తాజాగా యాక్టివ్ కేసులు 10వేలు   దాటాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నేడు కేంద్రం రాష్ట్రాల …

Read More »

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు షాక్

కేంద్ర ప్రభుత్వ పరిధిలో సర్కారు కొలువులు చేస్తోన్న ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా   కాలపరిమితికి మించి డిప్యుటేషన్ పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని బీజేపీ ప్రభుత్వం హెచ్చరించింది. డిప్యుటేషన్లపై సమీక్ష చేయాలని, కాలపరిమితి మించిన తర్వాత డిప్యుటేషన్పై ఉద్యోగులు కొనసాగకుండా చూడాలని అన్ని శాఖలను ఆదేశించింది. రాతపూర్వక అనుమతి ఇస్తే తప్ప …

Read More »

రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ  కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్‌ సూరత్‌ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది.మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన …

Read More »

మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ  మృతి

జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ  (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉషా గోకనీ   గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి  కి గతంలో ఆమె చైర్‌ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్‌ ఆశ్రమం లో గోకనీ బాల్యం గడిచింది.

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri