తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-బీజేపీకి దమ్ముంటే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారా అని నిలదీశారు. బీజేపీ-కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుబంధు ఇచ్చే సంస్కారం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ఎంత తిట్టినా ఎంత దూషించిన తమకు పోయేది ఏమీ లేదన్నారు. …
Read More »రాజయ్య కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ
తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఎంఈవో మంకు రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజన్న చివరి శ్వాస వరకు విద్య కోసం పని చేశారని కొనియాడారు. ఇటీవలే ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం రోజు …
Read More »దమ్ముంటే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా : మంత్రి కేటీఆర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నా.. ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయం చేయడం సరికాదు. దమ్ముంటే అభివృద్ధిలో తమతో పోటీ …
Read More »ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్ లైటింగ్ సిస్టం, బస్టాండ్ వద్ద మహిళా సంఘ …
Read More »శభాష్ కేటీఆర్ – అందరూ ఫిదా
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బండలింగంపల్లి నివాసులైన చింతల విజయ్-సంగీత దంపతులు తమ కొడుకు మౌలిక్(6) మెదడు సంబంధిత వ్యాధితో నాలుగేండ్లుగా బాధపడుతున్నాడు.. ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించినా కోలుకోలేదని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. మౌలిక్ చికిత్సకు తప్పకుండా సహకరిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమన్వయ …
Read More »ప్రేమ పేరుతో నరకం
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను బలి తీసుకున్నాడు. బండి రాజు అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఓ బాలికను వేధించేవాడు. ఆమెపై అత్యాచారం చేసి.. పురుగుల మందు తాగించాడు. అనంతరం తానూ తాగాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. ప్రేమ పేరుతో నరకం చూపించాడు’ అంటూ ఆ బాలిక చివరిమాట చెప్పి ఊపిరి వదిలింది.
Read More »మూగ బాలుడుకి అండగా మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్ వైద్యం కోసం …
Read More »వేములవాడలో దారుణం…డ్రైవర్ వైఫల్యమే దీనికి కారణమా..?
వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విధ్యార్ధులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీనంతటికీ కారణం డ్రైవర్ నే అని, తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని …
Read More »