గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు …
Read More »మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ ఇంట్లో ఐటీ దాడులు
బీహార్‌కు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ ఇంట్లో ఇవాళ గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖకు చెందిన సుమారు 25 మంది సభ్యులు మంత్రి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి.తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
Read More »BJP ఎమ్మెల్యే ఇంట పేలిన బాంబు
జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొడెర్మాలోని ఆమె ఇంటి సమీపంలో దుండగుడు బాంబు పేల్చారు. అయితే ఎవ్వరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, నిందుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. అయితే అతని మతిస్థిమితం సరిగాలేదని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Read More »