నర్సంపేట పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసుకునే దిశగా పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పురపాలిక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు అధికారులకు ,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన …
Read More »తెలంగాణకు హరితహారం..సీఎం కేసీఆర్ కీలక ఆదేశం
వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకంతో పాటు పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి …
Read More »తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు..సీఎం కేసీఆర్
ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కామారెడ్డి పట్టణ సమీపంలో గల అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుకట్టను బలోపేతం చేయడం, చెరువు కింది ఆయకట్టు పెంపు ప్రజలకు సౌకర్యవంతమైన పద్ధతిలో ట్యాంక్ బండ్ సుందరీకరణపై కామారెడ్డి ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రగతిభవన్ లో గురువారం …
Read More »దశాబ్దాల భూ వివాదాలకు పరిష్కారం….మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు మరో ప్రత్యేకతను తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్దకాలంగా ఉన్న భూ సంబంధిత వివాదాలకు చొరవతో నేడు పరిష్కార మార్గం చూపించారు. దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ ఇటీవల ఎల్బీనగర్‌లో జరిగిన మన నగరం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల నుండి భూ సంబంధిత వివాదాలు …
Read More »హైదరాబాదీలకు మంత్రి కేటీఆర్ తీపి కబురు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని హైదరాబాదీలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపికబురు చెప్పారు . పెద్ద ఎత్తున జరుగుతున్న ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మంత్రి కేటీఆర్ మరింత వేగవంతం చేశారు. వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈరోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో …
Read More »రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష
రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు అందించే పంట పెట్టుబడి కోసం అవసరమైన నిధులను సమకూర్చి, బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేసినట్లు సీఎం ప్రకటించారు. మే 1 నాటికి రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో రూ.4,114.62 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరో రెండు వేల కోట్ల నగదును …
Read More »అమ్మలానే.. తెలుగునూ కాపాడుకుందాం..సీఎం కేసీఆర్
తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, …
Read More »