ప్రముఖగాయని, గాన కోకిల జానకి ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమె బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. తీవ్రంగా నొప్పి రావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ప్రస్తుతం కోలుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉండగా.. ఆమె అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More »సింగర్ సునీతకు మళ్ళీ పెళ్ళా..!
భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు …
Read More »ఇవంకా పర్యటనపై సింగర్ సునీత సెటైర్లు ..
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇవంకా పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు .ఆమె తన అధికారక సోషల్ మీడియా ఖాతాలో రాయదుర్గం-ఖాజాగూడ రోడ్డు గుండా ఇవాంకా రావడం లేదేమో? వస్తే బాగుండును అని ఒక పోస్ట్ చేశారు . ఇవాంకా ఆ రూట్లో ప్రయాణించినట్లయితే అవి కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సునీత అలా కామెంట్ చేశారట. ఈ క్రమంలో సునీత పోస్టింగ్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇవాంకా ట్రంప్ …
Read More »ఆ వార్తల్ని ఖండించిన సుశీల..!
ప్రముఖ గాయని సుశీల మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్త విని ఒక్కసారిగా షాక్ తిన్న సుశీల..నేను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నానని.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నానని త్వరలోనే ఇండియాకి తిరిగి వస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో నా మరణ వార్త పై వస్తోన్న వార్తలను వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే గురువారం రాత్రి గాయని సుశీల మరణించినట్లు వార్తలు రావడమే కాకుండా …
Read More »గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం
దాదాపు 65 ఏళ్లుగా తన పాటలతో శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయకురాలిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని… తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఆమె తెలిపారు. వయసు పైబడుతుండటంతో పాడటం కష్టంగా మారిందని… అందుకే ఈ …
Read More »