తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా కల్హేర్ మండలంలో కొత్తగా నిర్మించిన ముప్పై పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఆసుపత్రి ఆవరణాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసవించిన గర్భిణీలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా బంగారు …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నామినేషన్లకు నేడే లాస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విధితమే. ఇప్పటికే ఈ ఎన్నిక గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున …
Read More »రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రేపు అక్టోబర్ ఒకటో తారీఖున మంత్రి వర్గం భేటీ కానున్నది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతిభవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సాయంత్రం నాలుగంటలకు ఈ భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు సమాచారం. ఇందులో చర్చించి కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంటారని అధికారక వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి రెవిన్యూ …
Read More »మరోసారి అదే పాత్రలో రవితేజ
టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …
Read More »ఏ దేశమేగినా తెలుగును మరువకండి
మాతృభాష పరిరక్షణ కు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా …
Read More »తెలంగాణలో ముందే దసరా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56.4లక్షల మంది బతుకమ్మ చీరలను అందుకున్నారు. అయితే బతుకమ్మ చీరల పంపిణీ దసరా పండుగకు ముందు రోజు వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మంత్రుల దగ్గర నుండి కార్యకర్తల వరకు …
Read More »బాలీవుడ్ లో విషాదం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు విజ్జూ ఖోటే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సూపర్ హిట్ సాధించిన చిత్రం షోలే లో కాలియా అనే పాత్రలో నటించి అందరి మన్నలను పొందారు. ఈ చిత్రంతో పాటు అందాజ్ అప్నా అప్నా,క్యామత్ సే క్యామత్ తక్,వెంటిలేటర్ వంటి …
Read More »బొప్పాయి తింటే
బొప్పాయి తింటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇది కోలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. దీనివలన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది నరాల బలహీనత రాకుండా చేస్తుంది.
Read More »సాగర్ కు కొనసాగుతున్న వరద
తెలంగాణ ,ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహాం వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రవాహాం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వరదప్రవాహాం ఎక్కువవ్వడంతో ఆరు క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ ఫ్లో 1.50లక్షల క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో మాత్రం అరవై ఐదు వేల క్యూసెక్కులుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులైతే ప్రస్తుతం …
Read More »బతుకమ్మ చీరెలను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలు ఎంతో సంబురంగా బతుకమ్మ వేడుకలను …
Read More »