Home / Tag Archives: slider

Tag Archives: slider

పవన్ మూవీలో అనసూయ

యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్‌.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా తళుక్కుమంటున్నారు. సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ నటిగానూ ఆకట్టుకుంటుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం భారీగా ఆఫర్లు వస్తున్నా అనసూయ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా అనసూయకి ఓ క్రేజీ ఆఫర్‌ వరించినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ …

Read More »

పంత్ కల నెరవేరిన వేళ

ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్ర‌క విజ‌యంలో టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ రిషబ్‌ పంత్‌ పాత్ర మరువలేనిది. శుబ్‌మన్‌ గిల్‌ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు. నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్‌ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్‌ ఆడిన …

Read More »

కేంద్ర ఆర్థిక మంత్రికి మంత్రి హారీష్ సూచనలు

కేంద్ర బడ్జెట్‌ (2021–22) రాష్ట్రాలను ఆదుకొనేలా ఉండాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆర్థిక సంఘం సిఫారసుల అమలు నుంచి వికలాంగులకు అందించే సాయం వరకు కేంద్రం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన నిర్మలా సీతారామన్‌కు వివరించారు. బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా నిర్మలా సీతారామన్‌ సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో …

Read More »

ఏకైక ఎమ్మెల్సీ వైసీపీ వశం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read More »

హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం

గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ నేడు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో రూ.4.6 కోట్లతో నిర్మించనున్న వైకుంఠదామం పనులను ప్రారంభిస్తారు. అనంతరం కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.18 కోట్లకుపైగా నిధులతో చేపట్టిన అధివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు బేగంపేటలోని ధనియాలగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం 10.10 గంటలకు ఫతేనగర్‌లో రూ. 270.50 లక్షలతో నిర్మిస్తున్న నాలా …

Read More »

యూపీలో దారుణం

ఉత్తరప్రదేశ్‌లో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పశువులకు మేతకోసం వెళ్లిన మైనర్‌ బాలికపై దుండగులు లైంగిక దాడికిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్యచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌ జిల్లా పురెందర్‌పూర్‌లో గత సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈనెల 18న బాధితురాలి తల్లి పశువుల మేతకోసం అడవిలోకి వెళ్లింది. గడ్డిని ఇంటికి తీసుకువెళ్లడానికి సైకిల్‌ తీసుకుని రావాలని తన 12 ఏండ్ల కూతురికి చెప్పింది. దీంతో …

Read More »

ఆదిపురుష్‌ ఓ అద్భుత ప్రపంచం

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆది పురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ సంస్థ నిర్మిస్తోంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్‌ క్యాప్చర్‌ షూటింగ్‌ మంగళవారం నుంచి మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘అంతర్జాతీయ సినిమాల్లో వాడే అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ‘ఆదిపురుష్‌’ కోసం ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాల్ని ఉపయోగిస్తూ ఇండియాలో తెరకెక్కుతున్న తొలి …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్.

ఏపీలో కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు యత్నించారు. TDP నేత దేవినేని ఉమ. కోవిడ్ నేపథ్యంలో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ఆందోళన చేస్తున్న ఉమను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. దీంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 256కరోనా కేసులు

తెలంగాణలో నిన్న 31,486 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఇందులో 4,005 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,581 కరోనా మరణాలుసంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 75,15,066 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

Read More »

వరుణ్ తేజ్ గని ఫస్ట్ పంచ్ అదిరింది

వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘గని’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులైలో రిలీజ్ కాబోయే ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్.. …

Read More »