రక్తహీనతను తెలియజేసే కొన్ని లక్షణాలను గమనిస్తూ ఉండండి. ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు తగ్గితే అలసట వచ్చేస్తుంది. రక్తహీనత, ఐరన్ లోపంతో ఏకాగ్రత లోపిస్తుంది. కండరాలు అలసిపోయి, నొప్పులు వేధిస్తాయి. జ రక్తప్రవాహం, రక్తకణాలు తగ్గడం మూలంగా చర్మం పాలిపోతుంది. మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు వచ్చినా రక్తహీనత ఉన్నట్లే. ఈ సమస్యలు కనిపిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read More »గోంగూరతో లాభాలెన్నో..?
గోంగూరతో రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. దీనిలోని విటమిన్ A వల్ల కంటికి సమస్యలు తొలగిపోతాయి. గోంగూరలోని B కాంప్లెక్స్, C విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి. గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికం. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములుంటే గోంగూర సహజ ఔషధంలా పనిచేస్తుంది. రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూర తీసుకోవాలి.
Read More »మంత్రి ఎర్రబెల్లి కి కరోనా
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Read More »ఏపీలో ఒమిక్రాన్ కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Read More »అందులో ఏపీ ముందు
ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 2019లో 6.3% ఉండగా 2021లో 11.3%కి చేరింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7%నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి …
Read More »ఒమిక్రాన్ వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు గారు కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయని, ఆ వేరియంట్ పట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్‌రావు శుక్రవారం …
Read More »తెలంగాణకు మరో ఘనత
దేశంలో గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ వరుసగా రెండో ఏడాది నెం.1 స్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఆడిటింగ్ను 100శాతం పూర్తి చేసింది. 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై 25శాతం గ్రామాలు తాము చేసిన నిధుల ఖర్చులను ఆన్లైన్లో ఉంచాలని కేంద్రం ఇటీవల ఆదేశించగా.. గడువు కంటే ముందే తెలంగాణ 100% ఆడిటింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత 72%తో తమిళనాడు, 60%తో ఏపీలో 2, 3 …
Read More »TSRTC మహిళా కండక్టర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కండక్టర్లకు TSRTC శుభవార్త చెప్పింది. మహిళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని అధికారులను MD V.C.సజ్జనార్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి 8 తర్వాత డ్యూటీలు వేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ తెలిపారు.
Read More »ఇక నుండి దళితబంధు ఎంపిక వాళ్ల చేతుల్లోనే
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే లకు అప్పగించనుంది. తొలి ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10 లక్షలు ఇవ్వనుండగా.. హుజురాబాద్ నియోజకవర్గం మినహా మిగతా చోట్ల ఈ పథకం త్వరలోనే అమలు చేయనుంది. …
Read More »‘Rx 100’ కాంబో మళ్లీ వస్తోందా..?
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘Rx 100’ కాంబో వస్తోందా..?..ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ – పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘Rx 100’. బోల్డ్ కంటెంట్‌తో రొమాంటిక్ లవ్‌స్టోరిగా వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు దర్శకుడు అజయ్ భూపతి..హీరోహీరోయిన్లు కార్తికేయ …
Read More »