ఏపీలో త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అయిన రత్నప్రభ గతంలో కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. కాగా, అధికార వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో నిలిచారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనాతో కన్నుమూశారు. ఆయన అకాలమరణంతో తిరుపతి …
Read More »పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు పరిటాల శ్రీరామ్ ముష్టికోవెల గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో తనపై దాడి చేశారంటూ ముష్టికోవెల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బత్తిన వెంకటరాముడు వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు ముష్టికోవెల …
Read More »చంద్రబాబు హత్యకు కుట్ర..?
ఏపీ మాజీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును ఏదో రకంగా అంతమొందించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 150 మంది ఎమ్మెల్యేలున్నా జగన్ కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని …
Read More »అవసరమైతే చంద్రబాబు అరెస్ట్
ఏపీ సీఐడీ అధికారులు అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేస్తారని మంత్రి కొడాలి నాని అన్నారు చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని దళితులను మోసం చేసి రూ.500 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని భయపెట్టి 500 ఎకరాలను కారుచౌకగా కాజేసి ప్రభుత్వానికి అధిక ధరలు అమ్ముకున్నారని తెలిపారు. వాస్తవానికి అసైన్డ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ …
Read More »చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం వచ్చారు. అమరావతి అసైన్డ్ భూ వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వచ్చారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద నోటీసులు …
Read More »జనంలోకి వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇప్పటివరకు జిల్లాల వారీగా వైఎస్ అభిమానులు ఇతర నేతలతో భేటీ అయిన షర్మిల ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో మెదటి బహిరంగ సభ …
Read More »బాలయ్యపై రోజా సెటైర్లు
ఏపీలో ఆదివారం రోజు విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో నగరి ఎమ్మెల్యే రోజా జోష్ లో ఉన్నారు.సీనియర్ నటుడు,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు వేశారు. బాలయ్య సినిమాలోని ‘తొక్కి పడేస్తా’ డైలాగ్ కు ‘వైసీపీ ఒకరికి ఎదురు వెళ్లినా.. ఒకరు వైసీపీకి ఎదురు వచ్చినా తొక్కి పడేస్తాం అంతే’ అని అన్నారు. మున్సిపాలిటీ ఛైర్మన్ సీటు కాదు కదా …
Read More »పురపాలక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ అయిన వైసీపీ అదరగొడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు గిద్దలూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, మదనపల్లి రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 20 వార్డుల్లో …
Read More »కడప స్టీల్ ప్లాంట్ పై మరో ముందడుగు
ఏపీలో కడప స్టీల్ ప్లాంట్ పై ముందడుగు పడినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం.. 2020 డిసెంబర్ 20న ప్రతిపాదనలు పంపించి, అత్యంత వేగంగా అనుమతులు పొందామంది. కాగా కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరులో ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది.
Read More »జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏలూరులో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 25వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. అందుకే జనసేన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నా, టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓటమికి ఇరు పార్టీల …
Read More »