దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ …
Read More »సీఎం కేసీఆర్ రెండో సోదరి భర్త కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్‌రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్ మంగాపురిలో రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. రాజేశ్వర్‌రావు మృతి వార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. ఉదయమే మంగాపురికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోనే రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read More »తెలంగాణ ఓటర్ల తుది జాబితా ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేస్తూ విడుదల చేసింది. ఇందులో కొత్త ఓటర్ల మార్పులు,చేర్పులు ,కొన్ని తీసివేతల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ జాబితాను విడుదల చేసింది. మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో 2,99,32,943మంది ఓటర్లు ఉన్నారని తేలింది. ఇందులో పురుషుల ఓటర్ల సంఖ్య 1,50,41,943.. మహిళల ఓటర్ల సంఖ్య 1,48,89,410.. ఇతరులు 1590 ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. …
Read More »వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్
మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. …
Read More »తెలంగాణ పోలీస్ కింగ్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగానికి మరో ఘనత దక్కింది. పోలీసింగ్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలోని పోలీస్ సీసీ కెమెరాల్లో సగానికి (2.75లక్షలు)పైగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ,సిబ్బందికి సదుపాయలు కల్పనలో కూడా తెలంగాణ ముందంజలో ఉన్నట్లు డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదికలో పేర్కొంది. అలాగే అత్యధిక పోలీస్ క్వార్టర్స్ ఉన్న రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలిచింది. పోలీసులకు …
Read More »టి.ఎస్-బిపాస్ అమలుకు సమాయత్తం కావాలి
టి.ఎస్ ఐపాస్ వలే అనుమతులను సులభతరం చేసి నిర్ణీత కాలంలో జారీచేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న టి.ఎస్-బిపాస్ అమలుకు సమాయత్తం కావాలని టౌన్ప్లానింగ్ అధికారులకు రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు పిలుపునిచ్చారు. టి.ఎస్-బిపాస్పై అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు. అందరం పౌరులుగా ఆలోచిద్దామని చెప్పారు. గురువారం ఎం.సి.హెచ్.ఆర్.డిలో హెచ్.ఎం.డి.ఏ, జిహెచ్ఎంసి, డి.టి.సి.పి టౌన్ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మార్చిలో ప్రయోగాత్మకంగా చేపట్టి, ఏప్రిల్ 2వ తేదీ నుండి పూర్తిస్థాయిలో …
Read More »ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిరసనలు ,ధర్నాలు జరుగుతున్నాయి. జిల్లాకి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన జిల్లా రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డును తీసుకురాని ఎంపీ అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఎంపీగా …
Read More »మాజీ ఎంపీ కవిత పోరాట ఫలితమే అది..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో పసుపుబోర్డు పెట్టాలని చేసిన పోరాట ఫలితమే కేంద్ర ప్రభుత్వం జిల్లాలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంజూరు చేసింది అని టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ తెలిపారు. నిన్న బుధవారం పార్లమెంట్ మీడియా పాయింట్ దగ్గర ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ” వరంగల్ లో ఉన్న …
Read More »హైదరాబాదీ బిర్యానీ గ్రేట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోనే అద్భుతమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. పారిస్ కు చెందిన తలసేరీ ఫిష్ బిర్యానీని అభివర్ణిస్తూ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీ రామారావు స్పందిస్తూ ప్రపంచంలోనే ఉత్తమ బిర్యానీగా చెప్పుకునే హక్కులన్నీ హైదరాబాద్ వే. మిగతా బిర్యానీలన్నీ అనుకరణాలే. ఇటీవల యూనెస్కో కూడా మా …
Read More »గల్లంతైన బీజేపీ,కాంగ్రెస్ అడ్రస్
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ అడ్రసులు గల్లంతయ్యాయి. వాటిని ప్రజలు బొందపెట్టారు. గత ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజలు ఆ పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లను కూడా దక్కనివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రమ్లోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, చౌటుప్పల్, …
Read More »