హైదరాబాద్ మహానగరంలోని ఫతేనగర్‌లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Read More »టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి
టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నేతలు పాలాభిషేకం చేశారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్ణంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం …
Read More »సిద్దిపేటలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముస్తాబాద్ సర్కిల్‌లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను మంత్రి హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ …
Read More »తెలంగాణ రాష్ట్రఉద్యమానికి జయశంకర్ సార్ దిక్సూచి
తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత ఆచార్య జయశంకర్ ఒక దిక్సూచి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన రోజున ఆచార్య జయశంకర్ సార్ మార్గదర్శనం చేసారని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైన తొలి ఉద్యమంలో ఆయన పాత్ర అజరమారంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.దివంగత ఆచార్య జయశంకర్ సార్ జయంతిని …
Read More »మంత్రి కేటీఆర్ చేయూత
న్యాయవిద్య అభ్యసించేందుకు సాయం చేయండంటూ ట్వీట్ చేసిన 24 గంటల్లోనే ఓ పేద విద్యార్థినికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. పేదరికం వల్ల ఖర్చులు భరించలేకపోతున్నానంటూ చేసిన విజ్ఞప్తికి స్పందించి చదువుకు భరోసా ఇచ్చారు. ‘కేటీఆర్ సర్ నా పేరు అంతగిరి హరిప్రియ. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో నాకు బీఏ ఎల్‌ఎల్‌బీ సీట్ వచ్చింది. ఖర్చులను భరించలేం. మేము చాలా పేదవాళ్లం. మా నాన్న రోజు కూలీ. దయచేసి …
Read More »యూనివర్సిటీలకు చేయూతను అందించాలి
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.జే. రావుకు సూచించారు. గురువారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీ.సీ. ప్రొ. బీ.జే. రావు సమావేశమయ్యారు. ఆయన ఇటీవలే వీ.సీ.గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా అభివృద్ధి, విద్యా విధానంలో అమలు చేయాల్సిన నూతన విధానాలు, …
Read More »భారత హాకీ జట్టు గెలుపుపై సీఎం కేసీఆర్ హర్షం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ …
Read More »డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరుగుతున్న వ్యర్థాల తొలగింపు పనులను గురువారం మంత్రి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుత.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరీల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందన్నారు.వ్యర్థాలను తొలగించి నూతనంగా మురికి కాలువలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. …
Read More »మూసీ నదికి కొత్త వన్నె
ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా ముస్తాబైంది. నాగోల్ పరిధిలో మూసీ నదిని రమణీయంగా తీర్చిదిద్దారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, పాకలను రూపొందించారు. 100 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంద్రాగస్టు రోజున ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ …
Read More »భారత పురుషుల హాకీ టీమ్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ టీమ్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. భారత హాకీ టీమ్ అద్భుతమైన చరిత్రను సృష్టించిందని కేటీఆర్ కొనియాడారు. మిమ్మల్ని చూసి ఈ దేశం గర్వ పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read More »