తెలంగాణలో మార్చి 14న జరగనున్న రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఎంపిక చేశారు. అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం పీవీ నరసింహారావు కూతురు వాణీ దేవికి ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రగతి భవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాణి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. సమావేశం …
Read More »తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పంచవర్ష ప్రణాళిక నిధులను ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తోందన్నారు
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో
దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ డెస్క్ పనిచేస్తుంది. ట్రాన్స్ జెండర్లకు ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇబ్బందులుంటే వాట్సాప్ నంబర్ 949067444కు తెలియజేయాలని సూచించారు
Read More »ఇంటర్ ఫెయిలైన వారికి శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిలైన వారికి ఇంటర్ బోర్డు ఊరట కల్గించింది. 2020 మార్చి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరికి మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షల్లో 70% సిలబస్, 50% ఛాయిస్ వర్తింపజేశారు. ఫస్టియర్ సప్లిమెంటరీతో పాటు సెకండియర్ పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఒత్తిడికి లోను కాకుండా ఈ అవకాశం కల్పించారు. సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులను ఇప్పటికే పాస్ చేశారు
Read More »గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు నగరాన్ని “ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020” గా ప్రకటించాయి. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా. ఆరోగ్యకరమైన సంతోషకర నగరంగా రూపొందడానికి దోహదపడ్డాయి.
Read More »రాజస్థాన్ రాళ్లతో తెలంగాణ సచివాలయం
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్ రాళ్లను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయనుండగా రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతిని తెప్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్ వెళ్లి యంత్రాల ద్వారా చెక్కించిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించినవి పరిశీలించాలని సీఎం సూచించారు.
Read More »హమాలీల ఛార్జీలు పెంపు
తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ పెంచిన హమాలీల ఛార్జీలు 2021 జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు
Read More »తెలంగాణలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.
Read More »తెలంగాణలో విద్యా వాలంటీర్ల నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో.. 9, 10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు కావాలని విద్యాశాఖ తెలిపింది. దీనిలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన 2,816 మంది టీచర్లు ఉండగా, ఇంకా 2,151 మంది కావాల్సి ఉంది. దీంతో విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుమతివ్వాలని. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు …
Read More »రండి చేయి చేయి కలుపుదాం-ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో అందరం భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించిన సంతోష్.హరిత వందనాలు వాస్తవాలను ప్రజల కళ్లముందుంచుతూ.. మంచిని వివరిస్తూ.. చెడును ఎత్తిచూపుతూ సమాజాన్ని చైతన్య పరచడంలో మీడియా పాత్ర వెలకట్టలేనిది. సమాజం పట్ల, పౌరుల హక్కుల పరిరక్షణ పట్ల మీ నిబద్దత ఎల్లప్పుడూ …
Read More »