జగిత్యాల జిల్లా, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో వెల్గటూర్ పెద్ద వాకుపై రూ 4.60 కోట్లతో నూతనంగా నిర్మించే చెక్ డ్యాం/ ఆనకట్టకు ఈరోజు శంకుస్థాపన, అనంతరం గొల్లపల్లి మండలం లొత్తునూర్, చిల్వకోడూర్ గ్రామాల్లో సదా జల వాగు పై 3.61 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాం/ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఈ సందర్భంగా మంత్రి …
Read More »మంత్రి కేటీఆర్ చొరవతో… స్వగ్రామానికి హరిలాల్ మృతదేహం
ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి అక్కడ గుండెపోటుతో మరణించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఆ వ్యక్తి మృతదేహం ఇవాళ సొంతూరుకు చేరుకుంది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండాకు చెందిన మాలోతు హరిలాల్ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో.. స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి …
Read More »తెలంగాణలో కొత్తగా 150 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇందులో 2,92,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 1610 మంది మరణించగా, 1939 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, నిన్నరాత్రి 8 గంటల వరకు 186 మంది కరోనా బారినుంచి బయటపడ్డారని, మరో ఇద్దరు బాధితులు మరణించారని తెలిపింది. మొత్తం యాక్టివ్ …
Read More »త్వరలోనే వరంగల్‌లో ఇంటింటికీ నల్లా నీరు
వచ్చే ఉగాది నుంచి వరంగల్ మహానగరంలో నల్లాల ద్వారా ఇంటింటికీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచినీటిని సరఫరా చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 57వ డివిజన్ హనుమాన్‌నగర్‌లో ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి …
Read More »నేడు టీఆర్‌ఎస్ విస్త్రృత స్థాయి సమావేశం.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, జడ్పీ చైర్మెన్ల వరకూ భేటికి ఆహ్వానించారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. పట్టబధ్రుల ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లో భారీ …
Read More »ధాన్యం సేకరణలో తెలంగాణకు రెండో స్థానం
2019-20 వానాకాలం ధాన్యం సేకరణలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి దాన్వే రావ్ సాహెబ్ పేర్కొన్నారు. పంజాబ్ నుంచి 162.33లక్షల టన్నుల ధాన్యం సేకరించింది.. తెలంగాణ నుంచి 111.26లక్షల టన్నులు సేకరించినట్లు తెలిపారు. ప్రతిఏటా ఈ పరిమాణం గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. ఇంకా TSలో గడిచిన నాలుగేళ్ల కాలంలో 97,133 బోగస్ రేషన్ కార్డులు రద్దు చేసినట్లు దాన్వే వివరించారు.
Read More »తెలంగాణలో ఈ నెల 13 నుంచి రెండో విడత కరోనా వ్యాక్సిన్
తెలంగాణలో ఈ నెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గత నెల 16 నుంచి తొలి విడత డోస్ పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటివరకూ టీకా తీసుకోకుంటే శనివారం వేయించుకోవాలని.. తొలి డోసు తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని అధికారులు …
Read More »ఈ నెల 7న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఈ నెల 7న(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను …
Read More »తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు
తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, పెట్రోల్‌తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గానీ, రోడ్డు …
Read More »తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ బియ్యం సరఫరాలో అమలు చేస్తున్న ఓటీపీ విధానంతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు.. పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇక ఆధార్ కు ఫోన్ నంబర్, ఐరిస్ అనుసంధాన ప్రక్రియ రేషన్ షాపుల్లోనే చేయాలని నిర్ణయించింది. దీనిపై వినియోగదారులకు అవగాహన లేక హైరానా పడుతున్నారు. మీసేవా, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. …
Read More »