Home / SLIDER / తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ బియ్యం సరఫరాలో అమలు చేస్తున్న ఓటీపీ విధానంతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు.. పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.

ఇక ఆధార్ కు ఫోన్ నంబర్, ఐరిస్ అనుసంధాన ప్రక్రియ రేషన్ షాపుల్లోనే చేయాలని నిర్ణయించింది. దీనిపై వినియోగదారులకు అవగాహన లేక హైరానా పడుతున్నారు.

మీసేవా, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. ఈ ఉత్తర్వులు జారీ చేశారు