దేశంలోనే తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికేట్ సాధించిన యువతి రాసకట్ల సంధ్యను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన సంధ్య.. మహిళలకు మైనింగ్ రంగంలో అవకాశాలు కల్పించాలని కొట్లాడిన ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు. మైనింగ్ రంగంలో సంధ్య సాధించిన విజయం, ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. “సంధ్య రసకట్ల, …
Read More »తెలంగాణలో మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ
తెలంగాణ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా ఎన్.శంకర్, వంశీకృష్ణ, సురేందర్‌రెడ్డి నియామకమయ్యారు. తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా జీ శ్రీనివాస్‌రెడ్డి, నార్సింగి మున్సిపల్ కమిషనర్‌గా సత్యబాబు, కొల్లాపూర్‌కు విక్రమసింహారెడ్డి, దేవరకొండకు వెంకటయ్య, భువనగిరికి పూర్ణచందర్‌రావు, జనగామకు సమ్మయ్య, నేరేడుచర్లకు గోపయ్య, తిరుమలగిరికి డీ శ్రీనివాస్, జహీరాబాద్‌కు సుభాష్‌రావు, నర్సాపూర్‌కు అశ్రిత్‌కుమార్, చేర్యాలకు రాజేంద్రకుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సీడీఎంఏ …
Read More »ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా
తెలంగాణ రాష్ట్రంలోనిమంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్ రిపోర్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
Read More »హైదరాబాద్ తూర్పులో ఐటీ విస్తరణకు చర్యలు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్ ఫ్రాంక్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ స్పెషల్ రిపోర్టును కూడా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో పాటు నైట్ ఫ్రాంక్ ఇండియా …
Read More »మోహిదీపట్నం స్కైవాక్‌కు మంత్రి కేటీఆర్ ఆమోదం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్‌ను అద్భుతంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దుర్గం చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెహిదీపట్నం వద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది..!
దుబ్బాక ఉప ఎన్నికలో ఇప్పటికే రెండు సార్లు ఫీల్డ్ సర్వే చేసిన సీపీఎస్ టీమ్…పోలింగ్ రోజు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్ 47.4% బీజేపీ 35.3% కాంగ్రెస్ 14.7% శాతం, ఇతరులు 2.6% ఓట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని సీపీఎస్ టీమ్ అంచనా వేసింది. …
Read More »నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని త్వరలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు ప్రస్తుతం యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఇద్దామనుకునే సమయానికి కరోనా వచ్చిందన్నారు. అటు యువత సైతం వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారని, ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నవారే ఇప్పుడు పండుగ అంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు
Read More »తెలంగాణలో కొత్తగా 1,637 కరోనా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 45,526 కరోనా టెస్టులు చేయగా 1,637 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,44,143కు చేరింది. ఇందులో 18,100 మంది చికిత్స తీసుకుంటుండగా, 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,357కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 44,39,856 కరోనా టెస్టులు చేశారు
Read More »అందుబాటులోకి తెలంగాణ సోనా బియ్యం
తెలంగాణ సోనా బియ్యం వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినేందుకు అనుకూలంగా ఈ బియ్యం ఉండనుండన్నాయి.. ఈ మేరకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో హైదరాబాద్ కు చెందిన బేపాక్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తెలంగాణ సోనా వరి రకాన్ని 2015లో సృష్టించారు
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
తెలంగాణలో ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రూ.1.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. నిరుపేదలకు అవసరమైన నివాసానికి అవసరమైన ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి …
Read More »