దుబ్బాకలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. భాజపా అభ్యర్థి సంబంధించి రెండుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నట్లు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ ముందు రోజు దుబ్బాకలోని చాలా గ్రామాల్లో భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నాయని …
Read More »ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై బీజేపీ నేతలు దాడి
మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది.
Read More »దుబ్బాకలో 9 గంటల వరకు 12.74శాతం పోలింగ్
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను సిబ్బంది ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. లచ్చపేటలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ …
Read More »మతం, దేశభక్తి ప్రచారాస్ర్తాలు కావొద్దు : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ర్టంలో కొందరు మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మట్టిలో పరమత సహనం ఉంది. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో స్థానం లేదు. విద్వేషాలను రెచ్చగొడితే ప్రజలే బుద్ధి చెప్తారు. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తారు. కానీ ఒకరిని చిన్నగా చేసి చూపించకూడదు. అలా చేయడం మంచిది కాదు. మతం ప్రచార అస్ర్తం కాదు.. దేశభక్తి ప్రదర్శన అస్ర్తమూ కాదు.. దేశభక్తి మనకే ఎక్కువ ఉంది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ అన్నారు. కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని వ్యవసాయ భూములను సైతం సాదాబైనామా ద్వారా ఉచితంగా క్రమబద్దీకరించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు కృజ్ఞతలు తెలుపుతూ.. హన్మకొండ ప్రశాంత్ నగర్‌లోని ఎమ్మెల్యే నివాసం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాన్యుడికి భారం కొవొద్దనే సీఎం కేసీఆర్ విలీన గ్రామాల రైతులకు ఉచితంగా సాదాబైనామా …
Read More »‘కట్టలు’ తెంచుకున్న బీజేపీ.. ఆటకట్టించిన పోలీసులు
దుబ్బాక ఉప ఎన్నికల్లో డబ్బుతో బీజేపీ ఓటర్లను ప్రలోభ పెట్టే కుట్రను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నంచేశారు. విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి ఇన్నోవా కారులో కోటి రూపాయలు తీసుకొని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన సురభి శ్రీనివాసరావు చందానగర్‌లో ఉంటూ పదేండ్లుగా …
Read More »రేపు దుబ్బాక ఓటరు ఇచ్చే తీర్పు ఉప ఎన్నికల తీర్పు మాత్రమే కాదు
ఆధిపత్యానికి, అణచివేతకు మధ్య అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య అహంభావానికి, తెలంగాణపై ప్రేమకు మధ్య అబద్ధానికి, నిజానికి మధ్య పోరాటానికి ముహూర్తం సమీపించింది. దెబ్బతగలని చేతికి దొంగకట్టు కట్టుకొని గోబెల్స్‌ని మించి మైకులను ఊదరగొట్టిన నేత ఒకరు. దశాబ్దాల తరబడి ప్రజలతో మమేకమై.. తామేం చేశామో.. ఏం చేయబోతున్నామో చెప్తూ నియతి తప్పకుండా ముందుకు సాగిన నాయకుడు ఇంకొకరు. బీజేపీ నేతల ఇండ్లల్లో డబ్బులు పట్టుబడితే పోలీసులపైనే ఉల్టా దాడిచేసి.. …
Read More »జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తాం
త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం150 సీట్లలో.. 104 సీట్లలో విజయం సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. బాధితులందరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా …
Read More »నేటినుంచి ధరణీ రిజస్ట్రేషన్
తెలంగాణ రెవెన్యూశాఖలో సోమవారం నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. గత నెల 29న సీఎం కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి అరగంటకు ఒక స్లాట్ చొప్పున కేటాయించారు.మధ్యలో అరగంటపాటు …
Read More »భాగ్య నగర ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు రూ.550 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో భరోసా దక్కిందని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తంచేశారు. వరదలతో ప్రజలు అవస్థ పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టడంపై హైదరాబాద్‌వాసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Read More »