ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తుందని, అయితే ప్రాణాంతక కరోన వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలతో పాటు సామూహిక శ్రీరామనవమి వేడుకలను నిర్వహించవద్దని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో ఎటువంటి ఆడంబరాలకు తావు లేకుండా పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ నెల 25 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకు పంచాంగ …
Read More »కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటది
రేపటి జనతా కర్ఫ్యూను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన రీతిలో 24 గంటలు పాటించి…విజయవంతం చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం లో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు. కరోనా పై ఈ యుద్దంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని చెప్పారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎళ్లుండి ఆరు …
Read More »తెలంగాణలో అర్టీసీ,మెట్రో రైల్ సర్వీసులు బంద్?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు దాదాపు ఇరవై నాలుగంటల పాటు రవాణా సర్వీసులు బంద్ కానున్నాయి. ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో …
Read More »తెలంగాణలో 21కి చేరిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఇరవై ఒకటికి చేరుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,274నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుండి ఇప్పటివరకు తెలంగాణకు ఇరవై వేలకు పైగా మంది వచ్చారు. పదివేల మందికి పైగా కరోనా పరీక్షలు చేశాము. ఏడు వందల మందికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉంది.వీరందరికీ పరీక్షలు …
Read More »జనతా కర్ఫ్యూలో పాల్గొందాం-సీఎం కేసీఆర్
ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ కర్ఫ్యూను ఎవరికివారు విధిగా పాటిద్దామని సూచించారు. కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణపై కలెక్టర్లు, పోలీసు, వైద్యారోగ్యశాఖ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.
Read More »సింగరేణి కార్మికుడు హౌజ్ క్వారంటైన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అధికారులు నడుంబిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో 14 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. మరో నాలుగుచోట్ల తాత్కాలిక చెక్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి చెక్‌పోస్టు దగ్గర రవాణాశాఖ నుంచి ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న వాహనాలను చెక్‌పోస్టుల్లో తనిఖీ చేస్తున్నారు. …
Read More »కేంద్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపికైన ఎంపీ జోగినపల్లి సంతోష్
ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి, పనితీరుపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి రాజ్యసభ సభ్యులు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఎంపిక అయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. లోక్ సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులు మొత్తం …
Read More »తెలంగాణలో మరో 2 పాజిటీవ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడమే కాకుండా విదేశాల నుండి వచ్చేవాళ్లను పలు పరీక్షలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు మరో రెండు కొత్తగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. విదేశాల నుండి వచ్చిన వారిలోనే …
Read More »రేపు కరీంనగర్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కరీంనగర్ వెళ్లనున్నారు. కరోనా నివారణ చర్యలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ పై నగర ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఇండోనేషియా నుండి వచ్చిన కొందరు కరోనా బాధితులు కరీంనగర్ లో పర్యటించిన నేపథ్యంలో నగరంలోని ప్రజలందరికీ ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read More »అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు
పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్ వాడీ కేంద్రాలలో, మినీ అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోపు వండి, వేడి, వేడిగా తల్లులకు, …
Read More »