రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య శాఖ అధికారులతో …
Read More »పట్టణ ప్రగతితో సమగ్రాభివృద్ది.
మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులు అభివృద్ది చేసుకోవడం మన బాద్యత అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మున్సిపాలిటీలో పలు కాలనిలలో పట్టణ ప్రగతి సందర్బంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,కలెక్టర్ హరిత గార్లు సందర్శించారు..కాలనీలలో తిరుగుతూ డ్రైనేజి,రోడ్లు,ఇతర సమస్యలను పరిశీలించారు..ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు. ముందుగా వార్డులు అభివృద్ది చెందితేనే పట్టణాలు అభివృద్ది చెందుతాయని సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు..కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ …
Read More »వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
తెలంగాణలోవెయిటింగ్‌లో ఉన్న 4 గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అనితా రాజేంద్ర, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణ శాఖ కమిషనర్‌గా ఎం. ఆర్. ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం. ప్రశాంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్ రాస్‌కు గనులు భూగర్భ …
Read More »మంత్రి హారీష్ రావు ఆదేశాలతో కదిలిన అధికారులు
తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజుల నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో,మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొంటున్నారు. పట్టణాల్లోని మురుగు కాలువలను పరిశుభ్రం చేయడమే కాకుండా పిచ్చి మొక్కలను తొలగించే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న మంత్రి సంగారెడ్డి …
Read More »మరో అద్భుతం ముంగిట కాళేశ్వరం ప్రాజెక్టు
‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను, మా చెలక ఎడారి..’ అనే ఉద్యమ గీతాన్ని పూర్తిగా మార్చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం సాక్షాత్కారానికి ముహూర్తం సమీపించింది. తలాపున పారుతున్న గంగమ్మను ఒడిసిపట్టి.. దాదాపు పది దశల్లో ఎత్తిపోసి.. తెలంగాణలోనే గరిష్ఠ ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు తరలించే ప్రక్రియ త్వరలో ప్రారంభంకానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పంలో భాగంగా ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలతో ఫిబ్రవరిలోనూ …
Read More »మూగ బాలుడుకి అండగా మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్ వైద్యం కోసం …
Read More »తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండల కేంద్రంలో మరియు రామకృష్ణాపురం గ్రామంలో రూ.51లక్షల 30వేలతో నూతన సిమెంట్ రోడ్ల పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృధ్ధికో సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్ తో ముందుకు వెళ్తున్నారని అన్నారు.ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండడం మన అదృష్టం అన్నారు.కొట్లాడి తేచ్చుకున్న తెలంగాణ …
Read More »వరంగల్ హైవేకి పచ్చని అందాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహాదారి త్వరలోనే పచ్చని అందాలతో కనువిందు చేయనున్నది. హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్ విభాగం అధికారులు వరంగల్ జాతీయ రహాదారి మధ్యలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఘట్కెసర్ నుండి యాదాద్రి వరకు నిన్న గురువారం సుమారు ముప్పై కిలోమీటర్ల మేర నేషనల్ హైవే -163వెంట సెంట్రల్ మీడియన్ (2.3మీటర్లు)లో గ్రీనరీ పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్భన్ …
Read More »కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్పీఆర్ విషయంలో పలు వర్గాల నుండి వ్యక్తమవుతున్న సందేహాలు,అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన చేపడతారు. అందులో భాగంగా …
Read More »ఆడబిడ్డలు మురిసేలా బతుకమ్మ చీరెలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత నాలుగేళ్ళుగా బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రానున్న బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ చీరల తయారిని ఈసారి రెండు నెలలకు ముందే ప్రారంభించింది. అయితే గతంలో బతుకమ్మ పండుగకు ఐదు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చిన కానీ పంపిణీకి ఆలస్యమవుతుందటంతో ఈఏడాది …
Read More »