కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీలంక దేశంలో సంచలనం సృష్టించిన పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ – ప్రముఖ బడా పారిశ్రామికవేత్త అదానీ అవినీతి బంధంపై యావత్ భారతవాని దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్ స్కీమ్‌ను ప్రకటించరా? అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ …
Read More »అగ్నిపథ్ తో దేశభద్రతకు ముప్పు: Mp ఉత్తమ్ కుమార్
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో దళితబంధు కింద 43 మందికి ట్రాక్టర్లు, ఐదుగురికి కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన వికాసానికి సర్కారు పెద్దపీట వేసిందన్నారు. ఐనోల్ గ్రామంలో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను ఇంటర్‌గా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు అదనపు భవనానికి రూ.4 …
Read More »తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్‌ఎన్పీడీసీఎల్ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ …
Read More »ఫాదర్స్ డే సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్
ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని ట్వీట్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను అందరితో పంచుకున్నారు. Happy Father’s Day to the best Dad …
Read More »సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తప్పిన ఘోర ప్రమాదం
కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ ఆందోళనల సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో ఆర్మీ అభ్యర్థులు పలు రైళ్లకు నిప్పు పెట్టిన సందర్భంలో పెను ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫామ్ పై నం-1పై ఉన్న రైలు బోగీకి నిప్పంటించగా దానికి అతిసమీపంలోనే రైళ్లలో నింపే డీజిల్ ట్యాంక్ ఉంది. ఘటన సమయంలో అందులో 20వేల లీటర్ల డీజిల్ ఉంది. దానికి మంటలు అంటుకుని ఉంటే …
Read More »సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్ల సూత్రదారి అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని దక్షిణమధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఏపీకి చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసారావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నడుపుతున్న సుబ్బారావు.. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో తన సొంతూరు ఖమ్మంలో ఉన్నట్లు తెలుసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. …
Read More »ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్
ఈ నెల 19న ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Read More »రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్ రావు నివాళులు
కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్ నివాళులు అర్పించారు.రాకేశ్ మృతికి నిరసగా నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాకేశ్ మృతదేహంతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ …
Read More »బీజేపీ సర్కార్ అన్ని వర్గాలను అణగదొక్కుతుంది
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ అన్ని వర్గాలను అణగదొక్కుతున్నదని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. రాకేశ్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్ మృతదేహానికి ఎంజీఎం దవాఖానలో నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలన్నారు. సైన్యంలో కూడా ఔట్‌సోర్సింగ్ విధానం తీసుకురావడం …
Read More »