Home / Tag Archives: telanganacm (page 189)

Tag Archives: telanganacm

బీబీ నగర్ – టోల్ గేట్ మధ్య రోడ్డు ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి విచారం

హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై బీబీ నగర్ టోల్గేట్ మధ్య ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్ లో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే దారిలో వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, …

Read More »

హైదరాబాద్ లో  మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్)లో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం రూ.2,679 కోట్లతో ఎల్బీనగర్ (రూ.900 కోట్లు), సనత్ నగర్ (రూ.882 కోట్లు), అల్వాల్ (రూ.897)లో ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక టిమ్స్ ఉండగా.. కొత్తవాటితో HYDకు నలువైపులా నాలుగు టిమ్స్ు అందుబాటులోకి రానున్నాయి.

Read More »

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు : మంత్రి ఎర్రబెల్లి

వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను అదేశించారు. శుక్రవారం వేసవిలో మంచి నీటి సమస్యల మీద ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

“సహజ “బ్రాండ్ పేరుతో 100 రకాల నిత్యావసరాలను మార్కెట్లోకి విడుదల

మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసేందుకు,వారి ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అందులో భాగంగానే తమ ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, కార్పోరేషన్ నిత్యావసరాలను ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి విడుదల చేసేందుకు “సహజ”బ్రాండ్ ను రూపొందించిందన్నారు.మంత్రి ఈశ్వర్ నియోజకవర్గం ధర్మపురికి చెందిన సుమారు 200మంది మహిళలు మేడ్చెల్ లోని మమతా, జీడిమెట్ల సుభాష్ నగర్ లో ఉన్న శ్రీయోగి, మణికంఠ …

Read More »

“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం”

“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం” అన్నారు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ”ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని” పురస్కరించుకొని మొక్కలు నాటిన ఆయన “ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని …

Read More »

దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేటలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు

దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎస్‌టీపీ ద్వారా శుద్ధిచేసిన మురుగునీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తామని మని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు. చెత్తను మురుగునీటి …

Read More »

మన కళలు, సాహిత్యం తెలంగాణ పంచ ప్రాణాలు – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మరుగునపడ్డ మన సాహిత్యం కోటిప్రభలతో వెలుగొందుతుందని, మన చరిత్రను మనమే రాసుకుంటున్న చారిత్రక సందర్భం ఆవిష్కృతమైందని జాగృతి వ్యవస్థాపక అద్యక్షులు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కోటి ఉమెన్స్‌ కాలేజీ అద్యాపకురాలు డాక్టర్‌ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’ అన్న పరిశోధనా గ్రంథాన్ని బుధవారంనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన కళలు, సాహిత్యమన్నవి తెలంగాణ …

Read More »

త్వరలో 13 వేల టీచర్‌ పోస్టులు భర్తీ-మంత్రి హరీష్ రావు

అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్‌ని ప్రారంభించిన ఆయన.. అనంతరం అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా …

Read More »

మేం నామినేటెడ్‌ వ్యక్తులం కాదు: మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళ సై ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌   అన్నారు. తాము నామినేటెడ్‌ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిధికి లోబడి …

Read More »

కొత్త సెక్రటేరియట్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలి

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు. మంగళవారం ముఖ్యమంత్రి నూతన సెక్రటేరియట్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును కూలంకశంగా, సూక్ష్మంగా పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat