ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి శుభవార్త చెప్పారు అవసరమైతే రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. నిన్న సిద్దిపేట జిల్లాలోని ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్య మంత్రి.. రైతుల నుంచి 4% మాత్రమే కమీషన్ తీసుకోవాలని ఏజెంట్లను ఆదేశించారు దేశవ్యాప్తంగా మద్దతు ధరపై ఆందోళనల నేపథ్యంలో సీఎం ప్రకటన రైతులకు భరోసా కల్పించనుంది
Read More »యాసంగి సీజన్లో పెరిగిన వరి సాగు విస్తీర్ణం
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2020తో పోల్చితే 9.88లక్షల ఎకరాలు పెరిగి 27.95 లక్షల ఎకరాలకు చేరింది. ఈ మేరకు వ్యవసాయశాఖ వెల్లడించింది. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 22.19తో పోలిస్తే 25శాతం అదనంగా పెరిగినట్లు తెలిపింది. ఈ సీజన్లో వరి, శనగ, మినుము పొద్దు తిరుగుడు పంటలు అధికంగా వేశారు. అటు మరో ప్రధాన పంట వేరు శనగ విస్తీర్ణం …
Read More »తెలంగాణలో వేరుశనగకు భారీగా ధర
తెలంగాణలో వేరుశనగ ధర భారీగా పెరిగింది. గద్వాల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ కు గరిష్ఠంగా రూ.8,376 ధర పలికింది. మద్దతు ధర రూ.5,225ను మించి ఉండటంతో రైతులు సంబరపడుతున్నారు. వనపర్తి మార్కెట్లో గత ఏడాది రూ.3,500 నుంచి రూ.5,000 లోపు ఉన్న వేరుశనగ ఈ ఏడాది ఏకంగా రూ.7,942 పలుకుతోంది. ఇక్కడి వేరుశనగకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. గతేడాది భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో రికార్డు స్థాయిలో ధరలు …
Read More »బంగారు తెలంగాణకు పునాదులు-గవర్నర్ తమిళిసై
సరికొత్త విజన్, కొత్త పథకాలు, నూతన ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదాల్చిందని గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ అన్నారు. ఆరున్నరేండ్లలో ఆకలిదప్పులు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయని చెప్పారు. 72వ గణతంత్ర వేడుకలు మంగళవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ పతాకావిష్కరణ చేసి.. వివిధ భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించారు.ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మండలి చైర్మన్ …
Read More »స్వావలంబిత సామ్యవాది సీఎం కేసీఆర్….
దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించేది కేంద్రమే తప్ప రాష్ర్టాలు కాదు. దాన్ని రాష్ర్టాలు శిరసావహించాలి. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాల పయనానికి మూడు దశాబ్దాలు దాటింది. ఆర్థిక సంస్కరణ అనేది ప్రజల కోసం జరగాలి. అలా జరిగినవాటిని, జరుగుతున్న వాటిని స్వాగతిద్దాం. కానీ సంస్కరణ అంటే వ్యాపారం/వ్యాపారుల కోసమే జరగడం పట్లనే అభ్యంతరాలు. సంస్కరణలకూ ఓ పద్ధతి, ప్రజానుకూలత పాటించకపోవడం వల్లనే దేశంలో మౌలిక సదుపాయాలకు పెను ప్రమాదం వచ్చి …
Read More »సచివాలయ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
నూతన సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవనాల నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగారు. నిర్మాణ పనుల్లో నిమగ్నమైవున్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సెక్రటేరియట్ ప్రధాన గేట్ తో పాటు,ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలతో సహా, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని కలియ తిరగారు. డిజైన్లను పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి …
Read More »పారే నీళ్లను చూడలేని కళ్లు!
‘ఇది కాళేశ్వరం కాదు, తెలంగాణకు పట్టిన శనేశ్వరం.. వరదలు వస్తే మోటర్లు బంజేసుకునే ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంది అంటే, అది మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే.. రీ డిజైన్‌లో భాగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో మోటర్లను 800 అడుగుల నుంచి 821 అడుగుల వద్ద వరదకు అందనంత ఎత్తులో పెట్టారు..’ ఇవీ.. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన మెసేజ్‌లు. మిడిమిడి జ్ఞానంతో, కాళేశ్వరం …
Read More »తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి ఆర్టీసీ బస్ పాస్లు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ పాస్లు జారీ చేయనున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించి బస్పాస్ కోడ్ పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్ధులకే బస్ పాస్లు ఇస్తామని అధికారులు తెలిపారు. బస్పాస్లను పొందే విద్యార్ధులు తమ విద్యా సంస్థ బస్పోస్ కోడ్ తో సహా నిర్దేశిత పత్రాలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు..
Read More »తెలంగాణ ప్రగతి అనేక రాష్ర్టాలకు ఆదర్శం-గవర్నర్ తమిళ సై
ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను, పథకాలను విజయవంతంగా అమలుచేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్‌మోడల్‌గా నిలిచిందని గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. అతితక్కువ వయసున్న యంగ్ స్టేట్‌గా తెలంగాణ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని అభినందించారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో తెలంగాణ రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందని కొనియాడారు. వినూత్న పంథాలో, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టడంలో తెలంగాణ మిగతా రాష్ర్టాలకంటే ముందువరుసలో …
Read More »మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన సమాఖ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »