తెలంగాణ మత్స్యశాఖ మరో వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతోపాటు.. వాటి విక్రయం ద్వారా మహిళలూ ఉపాధి పొందేలా కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం చేపలతోపాటు, చేపల వంటకాలనూ విక్రయించేలా తయారుచేసిన సంచార విక్రయ వాహనాలను (మొబైల్ ఫిష్ ఔట్‌లెట్స్) అందుబాటులోకి తెచ్చింది. గ్రూపులుగా ముందుకొచ్చే మహిళలకు వీటిని అందజేయాలని నిర్ణయించింది. దీనిద్వారా నిరుద్యోగ మహిళలకు ఉపాధి అందనుండగా.. వినియోగదారుడికి తన …
Read More »అన్ని కులాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి/కుల్లె కడిగి/చిట్టెపు రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభా ఆదివారం జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు …
Read More »కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా-ఎమ్మెల్యే కెపి వివేకానంద్
గాజుల రామారం డివిజన్ బేకారి గడ్డలో మంచి నీటి సరఫరా కూలాయి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ పాల్గోన్నారు..గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కోట్ల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని బేకారి గడ్డలో మంచి నీటి …
Read More »త్వరలోనే సూర్యాపేట ప్రజలకు 24గంటలు మంచినీరు
సూర్యాపేట పట్టణ ప్రజలకు 24 గంటలు మంచినీరు అందించే రోజులు ఎంతో దూరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వెనుక అన్నది గమనిస్తే 2014 తరువాత పట్టణంలో వచ్చిన మార్పు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికీ బోధపడుతుందని అయన అన్నారు.మురికి నీటి నుండి విముక్తి పొంది స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా లొనే అభివృద్ధి కనిపిస్తుందని ఆయన చెప్పారు.17.58 కోట్ల …
Read More »నెక్సాస్ హాస్పిటల్ ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణలో హైదరాబాద్ షేర్ లింగంపల్లిలో తొర్రూరు డాక్టర్ సోమేశ్వరరావు కుమారుడి నెక్సాస్ హాస్పిటల్ ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.అనంతరం హాస్పిటల్ లోని వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నూతన హాస్పిటల్ ని ప్రారంభించిన డాక్టర్ సోమేశ్వరరావు, అతడి కుమారుడు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. హాస్పిటల్ బాగా నడవాలని ఆకాంక్షించారు. …
Read More »త్రిసభ్య కమిటీకి సీఎం ఆదేశం
వేతన సవరణ, సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.వేతన సవరణ సంఘం కొద్దిరోజుల క్రితం సీఎంకు నివేదిక సమర్పిచింది. నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వారం, పదిరోజుల్లో …
Read More »నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరం
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరంలాంటిదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఖమ్మం నియోజకర్గంలోని పలువురు వివిధ అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతూ ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స తీసుకున్నారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 48 మందికి రూ.19.33 లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు …
Read More »దేశంలో తొలిసారిగా తెలంగాణ గిరిజన సైనిక్ స్కూల్
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల సిగలో ఒక్కొక్క పువ్వుగా రోజుకో విద్యా సంస్థ కొత్తగా వచ్చి చేరుతుంది. గిరిజన శాఖను మరింత వికసింపజేస్తున్నాయి. తెలంగాణ గిరిజన విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా, విద్యలో వారికి సమాన అవకాశాలే ధ్యేయంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ శాఖలో కొత్తగా పలు విద్యా సంస్థలు మంజూరు అవుతున్నాయి. …
Read More »వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగు విధానం, పంటల కొనుగోలు అంశాలపై చర్చిస్తున్నారు. పంటల కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో …
Read More »జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక …
Read More »