దేశంలోకరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్.. పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయనున్నారు.అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. …
Read More »త్వరలోనే 57 ఏళ్ళ వయసు నుంచి అసరా పెన్షన్లు
వయో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇస్తున్నదని, త్వరలోనే 57 ఏళ్ళు నిండి ఆ ఆపై వయసున్నవాళ్ళందరికీ పెన్షన్లు అందచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 57 ఏళ్ళు ఆ పై వయసు నిర్ధారణ కోసం పరీక్షలను నియోజకవర్గ కేంద్రాల్లోనే జరిగే విధంగా, స్క్రీనింగ్ సెంటర్లు పెడతామన్నారు. అసెంబ్లీలో శనివారం …
Read More »సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై …
Read More »కరోనాపై భయం వద్దు
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ వైరస్ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, …
Read More »బహరేన్ లో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు.
బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో లో మాజీ ఎంపీ తెరాస ఎన్నారై ముఖ్య సలహాదారు,జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని పబ్లిక్ గార్డెన్లో నిర్వహిoచారు అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ జాగృతి ప్రెసిడెంట్ బాబు …
Read More »పంచాయతీలకు రూ.5లక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలను మార్చాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీకు రూ.5 లక్షలను ప్రతి ఏడాది కేటాయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2020-21నుండే అమలు కానున్నది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం …
Read More »సంపద పెంచాలి… పేదలకు పంచాలి.. అనేది తమ విధానం
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2020-21ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఖర్చుపై గురువారం సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానంలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఇస్తున్నామని చెబుతోందని, అది బిచ్చమెత్తుకునేది కాదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా అంటూ ‘కిసీకా బాప్‌కా హై’అని వ్యాఖ్యానించారు. తర్వాత సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతాంగానికి …
Read More »మారుతీరావు ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు.శనివారం రాత్రి హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంగతి విదితమే. అయితే మారుతీరావు ఆస్తుల విలువ అక్షరాల రెండు వందల కోట్లు ఉంటుందనే వార్తలు జిల్లాలో విన్పిస్తున్నాయి. కిరోసిన్ వ్యాపారంతో ప్రారంభమైన మారుతీరావు ప్రస్థానం రైస్ మిల్లర్ గా..తర్వాత రియల్ ఎస్టేట్ గా అంచెలంచెలుగా ఎదిగాడు..
Read More »ఇంటింటికెళ్లి చెత్త ఎత్తి.. ఆదర్శంగా నిలిచిన మంత్రి హారీష్
స్వచ్ఛ సిద్దిపేటే మన లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్య సిద్దిపేట సాధ్యపడుతుందని, దీనిపై ప్రజల్లో మరింత మార్పు తెచ్చేందుకు తానే స్వయంగా వార్డుల్లో శుభ్రత కోసం అడుగులు వేస్తాపని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సోమవారం తెల్లవారు జామునే పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ చెత్త సేకరణ వాహనం వెంబడి తిరిగారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను ముందుండి …
Read More »విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది
“సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది. అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి. అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. నిజానికి సిఎం కెసిఆర్, వ్యవసాయాన్ని పండుగ చేశారు. బడ్జెట్ లో పేద రైతులకు పెద్ద పీట వేశారు. కెసిఆర్ లాంటి సీఎం నీ, ఇలాంటి బడ్జెట్ నీ, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేద”ని రాష్ట్ర పంచాయతీ …
Read More »