తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ దాడి సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో లంబాడిపల్లెకు చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, అటెండర్ దివ్యలపై పెట్రోల్ చల్లాడు. ఇంతలో అతడిని మిగితా సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమిని ఎంఆర్‌ఓ సిబ్బంది పట్టా చేయట్లేదని రైతు కనకయ్య వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. కాగా, సిబ్బంది మాత్రం అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా …
Read More »తెలంగాణలో మినీ గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలో మినీ గురుకులాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లట్ కు విన్నవించారు . ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ గెహ్లట్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు …
Read More »మల్లన్నసాగర్ కు గోదావరి జలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు మల్లన్నసాగర్. మల్లన్నసాగర్ కు త్వరలోనే కాళేశ్వరం జలాలు తరలిరానున్నాయి. డిసెంబర్ నెల చివరి నాటికి మల్లన్నసాగర్ కు నీటిని తీసుకురావాలి అనే లక్ష్యం దిశగా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నాయి. ఇప్పటికే మిడ్ మానేరు వరకు చేరిన నీళ్లను మరో రెండు పంపు హౌస్ ల …
Read More »బిగ్‌బాస్-3 విజేతకు ఎంపీ సంతోష్ సలహా
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బిగ్‌బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మొక్కలు నాటారు. దీనిపై ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందిస్తూ.. ‘బిగ్‌బాస్-3 విజేతగా నిలిచినందుకు మొదటగా శుభాకాంక్షలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినందుకు థ్యాంక్యూ. ప్రకృతితో తొలిసారి మమేకమవడం నీకు ఇదే తొలిసారి కావడంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు …
Read More »సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల తరపున ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా …
Read More »గజ్వేల్ లో మంత్రి హారీష్ రావు బిజీ బిజీ
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం గజ్వేల్,సిద్దిపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు గజ్వేల్ లోని ఇండియన్ బ్యాంకు ప్రారంభించారు. ఆ తర్వాత దొంతుల ప్రసాద్ గార్డెన్ లో సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ లకు సంబంధించిన మొత్తం 717 అర్హులైన …
Read More »దేశంలోనే హైదరాబాద్ కు రెండో స్థానం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఖ్యాతి నొందింది. నగరంలో ప్రజలకు నల్లాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు విడిచి రోజు స్వచ్చమైన తాగునీరు అందిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ తాగునీరు భేష్ అని తేలింది. మొత్తం పది శాంపిళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సేకరించగా తొమ్మిది శాంపిళ్లల్లో హైదరాబాద్ తాగునీరు బెస్ట్ …
Read More »జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణలో భాగంగా నగర సుందరీకరణకు విఘాతం కల్గించేవిధంగా పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలో అనాధికారకంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు,బ్యానర్లు,హోర్డింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనుమతుల్లేని ఒక్కో బ్యానర్ కు ,ఫ్లెక్సీకి రూ.5వేలు,వాల్ పోస్టర్ కు …
Read More »తెలంగాణకు ఏపీ కూలీలు వలస
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలంలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదప్రవాహాంతో కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చెరువులు,ప్రాజెక్టులు,వాగులు నీటితో కళకళాడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడంతో పెరిగిన నీటినిల్వ సామర్థ్యం.. ఆ చెరువుల కింద జోరుగా సాగిన వ్యవసాయం! ఈయేడు వర్షాలు సమృద్ధిగా పడటంతో ఐదారు గుంటలున్న రైతులు సైతం పంటలను సాగుచేశారు. పంటసీజన్‌లో …
Read More »విదేశాల్లో తెలంగాణ మిర్చికి గిరాకీ
తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి మరోకసారి ప్రపంచానికి పాకింది. వాణిజ్య పంటల్లో ప్రముఖమైన మిర్చి సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ వ్యాప్తంగా 8.4లక్షల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది.దీని ద్వారా 20.96లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 79.59వేల హెక్టార్ల సాగువిస్తీర్ణంతో నాలుగో స్థానంలో ఉంది. ఉత్పత్తిలో 3.98లక్షల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో ఉంది.జాతీయ దిగుబడి సగటు …
Read More »