తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోనే అత్యధికంగా మామిడి పంట కొల్లాపూర్ ప్రాంతంలోనే పండుతుంది.. ఇక్కడ్నుంచి దేశవిదేశాలకు ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో స్థానిక రైతులు తమ పంటను అమ్ముకునేందుకు రాష్ట్ర …
Read More »తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022 ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఇక 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉండగా.. 2021తో పోలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షలు పెరిగింది.
Read More »నడ్డా నక్రాలు ఆపు… ఈడ నిన్ను నమ్మే బక్రాలు ఎవ్వరూ లేరు’
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్ధాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారని, ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేల, ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దామని, మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధమని నడ్డాకు సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయని …
Read More »ఈ నెల 10వరకు రైతుబంధు ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలంలో ప్రారంభించిన రైతుబంధు ద్వారా ఈ యాసంగి దాకా నాలుగేండ్లలో 8 సీజన్లకు రైతాంగానికి రూ.50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. ప్రస్తుతం 8వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఈ సీజన్‌లో గత నెల 28న ప్రారంభమైన రైతుబంధు పంపిణీ ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా …
Read More »తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో ఇద్దరు మరణించారు. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి మరో 232 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,733 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా నేడు 28,886 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.
Read More »తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. వీరిలో 27మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More »బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో షేక్‌పేట్-రాయదుర్గం ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ రాయదుర్గం వైపు నుంచి ఫ్లై ఓవర్ ఎక్కి షేక్‌పేట వైపు వెళ్లారు. ప్రయాణంలో వంతెనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎస్‌ఆర్‌డీపీ ఇంజనీరింగ్ అధికారుల బృందం గొప్పగా కృషి చేసిందని కొనియాడారు. అదే సమయంలో, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దయచేసి ఈ ఫొటోలను …
Read More »హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ కానుక
న్యూ ఇయర్ కానుకగా హైదరాబాద్ ప్రజల కోసం షేక్ పేట్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. రూ. 333.55 కోట్ల అంచనాతో నిర్మించిన 2.8కి.మీ ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి JNTU జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేయనుంది.
Read More »కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వస్త్రాలపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని లేఖలో కోరిన ఆయన.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలన్నారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందన్న మంత్రి కేటీఆర్ కోట్లాది మంది చేనేతల జీవితాలు దెబ్బతింటాయన్నారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్న మంత్రి.. రైతుల మాదిరిగా నేతన్నలు కూడా కేంద్రంపై తిరగబడతారన్నారు.
Read More »న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్న పోలీసులు.. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే, డ్రైవర్లు రద్దు చేయటానికి వీల్లేదన్నారు. క్యాబ్ సర్వీసును రద్దు చేస్తే రూ.500 జరిమానా వేస్తామన్న పోలీసులు.. సమస్య వస్తే 9490617111 నెంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
Read More »