Breaking News
Home / Tag Archives: thanneeru harish rao

Tag Archives: thanneeru harish rao

CPR శిక్షణ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి తన్నీరు హారీష్ రావు

దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన CPR శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సడన్ కార్డియాక్ అరెస్టుకు, హార్ట్ ఎటాక్‌కు మధ్య తేడా ఉందని చెప్పారు. మనిషి అప్పటికప్పుడు కుప్పకూలడమే కార్డియాక్‌ అరెస్ట్‌ అని, అప్పుడు చేసేదే …

Read More »

నిమ్స్‌ దవాఖానా.. తీరదు నీ రుణం

నోరు లేని ఎడ్డోడు మా పెద్దోడు.. నోరుండి లోకం తెలువని మూగోడు మా సిన్నోడు.. నేను డ్రైవర్‌ పన్జేత్త. పదిహేను రోజులు బండి నడిపితే, తతిమా పదిహేను రోజులు కూలీ పనికి వోత. నా పెండ్లాం కన్కవ్వ ఊరంతా తిరుగుకుంట కాయగూరలమ్ముతది. కన్కవ్వ అంటే ఎవ్వలు గుర్తువడుతరో లేదో గని, కూరగాయల కన్కవ్వ అంటే మాత్రం మా ముంజంపల్లి ఊర్లె గుర్తువట్టనోళ్లుండరు. నేను స్టీరింగ్‌ మీదున్నప్పుడు సీమగ్గూడ నట్టం జేయలె. …

Read More »

ఈ నెల 8 నుంచి ‘ఆరోగ్య మహిళ’

Minister harish rao COMMENTS ON CENTRAL minister nirmala sitaraman

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి ఈ నెల 8 నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శనివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీఆర్‌, కంటి …

Read More »

ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి హారీష్ రావు సంతాపం

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేత..  సీనియర్ శాసనసభ్యులు జి సాయన్న మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తన్నీరు హారీష్ రావు …

Read More »

తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం

 తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. నేడు మహశివరాత్రి సందర్భంగా మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిఏడాది ప్రవేశపెట్టే  బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శశoగా నిలుస్తున్నదని వెల్లడించారు. …

Read More »

చరిత్ర మరిచావా చెల్లెలా- ఎడిటోరియల్ కాలమ్

షర్మిలమ్మా! మీరు ఘనంగా చెప్తున్న రాజన్న రాజ్యం చూసినం మేము గతంలో. ఆయన పుత్రికగా మీకేమన్నా తెలియకపోతే తెలియజెపుదామని నా ప్రయత్నం. తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడానికి హైదరాబాద్‌ పాతబస్తీలో మత కల్లోలాలు సృష్టించి అమాయకులైన ఇరు మతాల వారిని పొట్టన పెట్టుకున్నరు మీ రాజన్న! అన్న చేత వెలివేయబడి; ఆస్తులకు దూరమై; ఇల్లూ వాకిలీ వదిలి; ఈసురోమంటూ..! ఇది అ-ఆ-ఇ-ఈల కవిత కాదు, …

Read More »

తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్‌…

వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్‌ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్‌ …

Read More »

త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

Admissions In Karimnagar Medical College From August ANNONCED BY Minister Gangula

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు …

Read More »

తెలంగాణ శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈ నెల 11న నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 12వ తేదీన మండ‌లిలో డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక నిర్వ‌హించ‌నున్నారు. డిప్యూటీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్సీ బండ ప్ర‌కాశ్ ముదిరాజ్ పేరు ఖ‌రారు అయింది. బండ ప్ర‌కాశ్ ఎమ్మెల్సీగా 2021, న‌వంబ‌ర్ నెల‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. చైర్మ‌న్‌గా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే.

Read More »

యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను మూడింతలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 1,000 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్యను 3వేలకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీ సీఈవో డాక్టర్ రాడ్ హోచ్మన్, సీఐవో మూర్, ఇండియా హెడ్ మురళీ కృష్ణలు భేటీ అయ్యారని ట్విటర్లో పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino