దుబ్బాక ఉప ఎన్నికల్లో డబ్బుతో బీజేపీ ఓటర్లను ప్రలోభ పెట్టే కుట్రను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నంచేశారు. విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి ఇన్నోవా కారులో కోటి రూపాయలు తీసుకొని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన సురభి శ్రీనివాసరావు చందానగర్‌లో ఉంటూ పదేండ్లుగా …
Read More »రేపు దుబ్బాక ఓటరు ఇచ్చే తీర్పు ఉప ఎన్నికల తీర్పు మాత్రమే కాదు
ఆధిపత్యానికి, అణచివేతకు మధ్య అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య అహంభావానికి, తెలంగాణపై ప్రేమకు మధ్య అబద్ధానికి, నిజానికి మధ్య పోరాటానికి ముహూర్తం సమీపించింది. దెబ్బతగలని చేతికి దొంగకట్టు కట్టుకొని గోబెల్స్‌ని మించి మైకులను ఊదరగొట్టిన నేత ఒకరు. దశాబ్దాల తరబడి ప్రజలతో మమేకమై.. తామేం చేశామో.. ఏం చేయబోతున్నామో చెప్తూ నియతి తప్పకుండా ముందుకు సాగిన నాయకుడు ఇంకొకరు. బీజేపీ నేతల ఇండ్లల్లో డబ్బులు పట్టుబడితే పోలీసులపైనే ఉల్టా దాడిచేసి.. …
Read More »జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తాం
త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం150 సీట్లలో.. 104 సీట్లలో విజయం సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. బాధితులందరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా …
Read More »నేటినుంచి ధరణీ రిజస్ట్రేషన్
తెలంగాణ రెవెన్యూశాఖలో సోమవారం నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. గత నెల 29న సీఎం కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి అరగంటకు ఒక స్లాట్ చొప్పున కేటాయించారు.మధ్యలో అరగంటపాటు …
Read More »రైతు బంధు వులంతా పేదరైతులే
రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులే అధికంగా లబ్ధిపొందుతున్నారు. ఈ వానకాలం సీజన్‌లో ప్రభుత్వం మొత్తం 57.81 లక్షల మంది రైతులకు రైతుబంధు అందజేసింది. వీరిలో సన్నకారు రైతులే (2.47 ఎకరాలలోపు భూమి ఉన్నవారు) 40.46 లక్షల మంది ఉన్నారు. ఇక చిన్నకారు రైతులు (2.48-4.94 ఎకరాలు) 11.33 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో చిన్న, సన్నకారు …
Read More »ఫార్మా బ్రాండ్ హైదరాబాద్
ఫార్మారంగంలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకొనే దిశగా ముందుకు వెళ్తున్నది. తాజాగా రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించడానికి ముందుకొచ్చాయి. మంగళవారం ప్రగతిభవన్‌లో గ్రాన్యూల్స్ ఇండి యా, లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. అనంతరం తాము హైదరాబాద్‌లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్న ట్టు వెల్లడించారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో …
Read More »రఘునందన్ కు మంత్రి హారీష్ రావు సవాల్
‘‘దేశంలో ఎవరింట్లో డబ్బులు దొరికినా తనవేనని బద్నాం చేస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటున్నారు. ఎవరింట్లోనో డబ్బులు దొరికితే నీకు భయమెందుకు? అక్కడికి వెళ్లి నువ్వెందుకు అతి చేశావు? దుబ్బాకలో ప్రచారం పక్కనబెట్టి సిద్దిపేట వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల చేతుల్లోంచి డబ్బులు ఎందుకు లాక్కున్నారు?’’ అని మంత్రి హరీశ్‌రావు.. రఘునందన్ రావును ప్రశ్నించారు. డిపాజిట్ ఓట్లు కూడా దక్కవనే ఆలోచనతో రాజకీయ సానుభూతి కోసం బీజేపీ అభ్యర్థి …
Read More »రైతు సంక్షేమమే సర్కారు లక్ష్యం
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం చిన్నరావిరాల గ్రామానికి చెందిన కొలన్ సుధాకర్‌రెడ్డి ఇటీవల మరణించాడు. ఆయన భార్య కొలన్ విజయలక్ష్మికి రూ. 5లక్షల రైతుబీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీ సత్యనారాయణ, రైతుబంధు …
Read More »కరోనాను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ టాప్
కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. వైరస్ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని …
Read More »వరద నష్టం రూ.5వేల కోట్లు
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 …
Read More »