యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిపుణులు హాజరయ్యారు. యాసంగిలో ఏయే పంటలను ఏయే ప్రాంతాల్లో సాగు చేయాలనే అంశంపై సీఎం చర్చిస్తున్నారు. వానాకాలంలో మాదిరిగానే యాసంగిలోనూ నియంత్రిత సాగు స్ఫూర్తి కొనసాగాలని వ్యవసాయ శాఖ అధికారులతో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించిన …
Read More »పాత ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు చెల్లుబాటు
ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్ బోర్డులోకి తీసుకునేందుకు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరించాలని సూచించారు. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ పథకం 2015 కింద జనవరి 31,2020 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ …
Read More »అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో మమేకం కావాలని గ్రూప్-2 అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవా రం ఎంసీహెచ్చార్డీలో గ్రూప్-2 అధికారుల 40 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవకు గ్రూప్-2 ఉద్యోగం గొప్ప అవకాశమన్నారు. కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హరిప్రీత్‌సిం గ్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్లు నబీ, …
Read More »నేడు రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన కవిత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు సాధించి, డిపాజిట్ కోల్పోయారు. 10 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తం రెండు …
Read More »జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని …
Read More »ఆరోగ్యశాఖలో మానవత్వంతో పనిచేయాలి : మంత్రి ఈటల
ఆరోగ్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మానవత్వంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని మంత్రి తెలిపారు. కరోనా బాధితుల చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తే ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేసి …
Read More »దర్గాలో మాజీ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు. కవిత వెంట హోంమంత్రి మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా …
Read More »అభ్యర్థి ఎవరైన గెలుపు పక్కా..!
త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడలపై మంత్రులు నేతలతో సమీక్ష చేశారు. అభ్యర్థి ఎవరైనా, గెలుపు ఖాయంగా పని చేయాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర …
Read More »దుబ్బాక ఉపఎన్నికపై ఎన్ఆర్ఐలతో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలతో మంత్రి హరీశ్‌రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దుబ్బాక ఉపఎన్నికపై ఎన్ఆర్ఐలకు వివించారు. దుబ్బాకలో ఎన్నికల ప్రచార సరళిని వారికి వివరించారు. ఈఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల పాత్రపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మరణంతో దుబ్బాకలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో రామలింగా రెడ్డి భార్య సుజాతను టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. మంత్రి హరీశ్‌రావు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికలు వచ్చేనెల 3న జరగున్నాయి. …
Read More »