తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ వంతుకోసం లైన్లలో నిలబడ్డారు. దీంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదయింది. అదేవిధంగా అచ్చంపేటలో 11 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 15 శాతం, నకిరేకల్‌లో …
Read More »కరోనా కష్ట కాలంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ
కరోనా కష్ట కాలంలో, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలను నిండుమనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లలో ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత, సాయం కోరిన ప్రతీ ఒక్కరికీ …
Read More »సీఎం కేసీఆర్ కి యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ గారికి గురువారం నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. నిన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు శ్రీ ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం …
Read More »తెలంగాణలో లాక్‌డౌన్‌పై మంత్రి ఈటల స్పష్టత
తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేపట్నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్‌లు ప్రారంభిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ర్టంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని …
Read More »కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటల ఫైర్
కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాలపై ఆరోపణలు చేయడం సరికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణలో 4 రాష్ర్టాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మేం కేంద్రాన్ని విమర్శించట్లేదు.. వారే …
Read More »తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »సీఎం కేసీఆర్ గారికి కరోనా నెగిటీవ్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ గారి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం బుధవారం నాడు ఇసోలేషన్ లో వున్న సీఎంకు వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించగా…రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు నేడు గురువారం రానున్నాయి.
Read More »జల దృశ్యం నుంచి..సుజల దృశ్యం దాకా..
కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వందేండ్ల చరిత్ర గల కాంగ్రెస్ కూడా ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో బలంగానే ఉన్నది. ఇక రాష్ట్రంలో చంద్రబాబు ప్రభావం నడుస్తున్న కాలం అది. అప్పుడు రాష్ట్రంలో పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. 1950ల్లో ఒకసారి, 1969లో ఒకసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. …
Read More »మంత్రి పువ్వాడ సమక్షంలో 150 మందితో TRSలో చేరిన 18వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని పద్మ..
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్(KMC) ఎన్నికల్లో 18వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్న అభ్యర్థిని అయినాల పద్మ, భర్త శ్రీనివాసరావు తో పాటు 150 మంది కార్యకర్తలు స్థానిక తెరాస అభ్యర్థి మందడపు లక్ష్మీ మనోహర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సమక్షంలో తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పు సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధికి చిరునామా గా ఉన్న తెరాస …
Read More »ఆపదలో ఉన్నా అంటే చాలు నేనున్నా అంటున్న మంత్రి కేటీఆర్
ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ యువతి కొవిడ్ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తమ సోదరి స్థితిని వివరిస్తూ యువకుడు రెమ్‌డెసివిర్ డ్రగ్ కావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విన్నవించాడు. దయచేసి ఆంధ్రా ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరాడు. దీనిపై తక్షణం స్పందించిన మంత్రి కేటీఆర్ తన స్నేహితుడు, ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి …
Read More »