Home / SLIDER / క‌రోనా క‌ష్ట కాలంలో ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక చొర‌వ‌

క‌రోనా క‌ష్ట కాలంలో ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక చొర‌వ‌

కరోనా కష్ట కాలంలో, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలను నిండుమనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లలో ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత, సాయం కోరిన ప్రతీ ఒక్కరికీ చేయూతనిస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్ లో వచ్చిన విజ్ఞప్తులపై సైతం వెంటనే స్పందిస్తూ కరోనా బాధితులకు భరోసానిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత.

కరోనా సెకండ్ వేవ్ దేశమంతా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సైతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కరోనా విషయంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 ఫోన్ నెంబర్లతో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ కాల్ సెంటర్లకు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా బాధితులు సాయం కోసం సంప్రదిస్తున్నారు.

కాల్ సెంటర్లకు వచ్చే ప్రతి విజ్ఞప్తిని నేరుగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ కవిత, ఆస్పత్రుల్లో బెడ్లు, రెమ్ డెసివిర్ ఇంజక్షన్ లు, ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి అన్ని విషయాలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ, కరోనా పేషంట్లకు, వారి కుటుంబాలకు ఎమ్మెల్సీ కవిత భరోసానిస్తున్నారు. ఒకవేళ నిజామాబాద్ ఆస్పత్రుల్లో బెడ్ అందుబాటులో లేని సమయంలో, బాధితులను త్వరితగతిన హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించేదుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి సైతం, హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన వెంటనే, మందులు, ఆహారం వంటి వాటిని నేరుగా పేషెంట్ల ఇండ్లకు చేరేవేస్తున్నారు. దీంతోపాటు ట్విట్ట‌ర్ వేదికగా వస్తున్న వినతులపైనా ఎమ్మెల్సీ కవిత దృష్టి సారిస్తున్నారు. బాధితుల వివరాలను సంబంధిత అధికారులకు, ఆస్పత్రులకు షేర్ చేస్తూ, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు ఎమ్మెల్సీ క‌విత‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat