తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి కేసుల సంఖ్య 5వేలు దాటేసింది. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 1,29,637 టెస్టులు నిర్వహించగా.. 5,093 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 3,51,424కు పెరిగింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. గత ఏడాది జూన్ 7, జూలై 31, ఆగస్టు …
Read More »ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్ లైటింగ్ సిస్టం, బస్టాండ్ వద్ద మహిళా సంఘ …
Read More »తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వం ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,29,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 5093 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. వైరస్ బారినపడినవారిలో 15 మంది మరణించగా, మరో 1555 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.51 లక్షలకు చేరాయి. ఇందులో 3.12 లక్షల మంది డిశ్చార్జీ అవగా, 1824 …
Read More »తెలంగాణలో కరోనా విలయ తాండవం
తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4446 కరోనా కేసులు నమోదవగా మరో 12 మంది బాధితులు మరణించారు. 1414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3.46 లక్షలకు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైరస్‌వల్ల మరణించగా, మరో 3.11 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు. …
Read More »సూర్యాపేటలో ఫిక్లర్ ట్రీట్ మెంట్ ప్లాంట్
సూర్యాపేటలో ఎఫ్.ఎస్. టి.పి(ఫికల్ సర్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్మాణం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని మున్సిపాలిటికి బదలాయించాలని ఆయన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని ఆదేశించారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ఇమాంపేట లో స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ లతో …
Read More »కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కేటీఆర్
సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధ అర్థం చేసుకుని వారి కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని దివ్యాంగులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాట సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారు. పేదరికంలో ఉండే పేదలు కానీ, ఇతర శారీరకమైన ఇబ్బందులు ఉండే దివ్యాంగులకు బాసటగా, ఆసరాగా నిలబడాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్ ఉద్ఘాటించారు. మీ ముఖాల్లో చిరునవ్వును చూసిప్పుడే తమకు …
Read More »తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,840 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇందులో 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 3,09,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 9 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,797కి చేరింది.
Read More »జీహెచ్ఎంసీ పరిధిలో 505 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలో గడచిన 24 గంటల్లో మరో 505 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 88, 812కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు
తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. రాష్ట్రంలో కూడా పబ్లిక్ పరీక్షల నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం – 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్
తెలంగాణలో మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపట్నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న అభ్యర్థుల …
Read More »