తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 52 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,211 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »దండి యాత్ర అద్భుత ఘట్టం : సీఎం కేసీఆర్
స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 75 వారాలపాటు ఈ …
Read More »రాజకీయ శక్తులను ఎదుర్కొని రాష్ర్టం సాధించాం : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పడు టీఆర్ఎస్ పార్టీకి మనీ పవర్ లేదు.. మజిల్ పవర్ లేదు.. మీడియా పవర్ లేదు.. మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట్ హరిత ప్లాజాలో తెలంగాణ జీవితం – సామరస్య విలువలపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. …
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా 44 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మరో 44 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,159 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »మార్చి 15 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం అవుతున్నారు. 2021-22 బడ్జెట్ ఏర్పాట్లు పూర్తవ్వగా.. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 18న 11:30నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.
Read More »తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కై ధరణిలో ప్లాట్ బుక్ చేసే వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించాక.. అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ కు వెళ్లకూడదనుకునే వారికి వెసులుబాటు ఇస్తూ కొత్త ఆప్షన్ తెచ్చింది. దీని ప్రకారం స్లాట్లు రద్దు చేసుకుంటే ఫీజులన్నీ వెనక్కు ఇవ్వనున్నారు. కాగా ఇటీవలే పలు సమస్యలకు ధరణిలో 10 కొత్త ఆప్షన్లు తీసుకొచ్చారు
Read More »కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదు
హైదరాబాద్ మహా నగరంలోని పల్లవి ఇన్‌స్టిట్యూట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రయివేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. విభజన చట్టంలోని సంస్థలను కూడా తెలంగాణకు ఇవ్వలేదు. రాష్ర్ట ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 లక్షల 72 వేల కోట్లు కడితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి చ్చింది రూ. లక్షా …
Read More »తెలంగాణలో కొత్తగా 142 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 32,198 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది..కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,153కి చేరింది. ఇందులో 1,769 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 633 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,96,740 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,644కి చేరింది
Read More »జర్నలిస్టు కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. 260మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చామన్నారు. వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. జలవిహార్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్.. జర్నలిస్టులకు నాణ్యమైన ఆరోగ్య స్కీం తీసుకొస్తామన్నారు.
Read More »పార్టీ మనకు అండగా నిలబడుతుంది-ఎమ్మెల్యే అరూరి…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46,47డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో గోపాల్ పూర్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీ పాటిష్టానికి కార్యకర్తలే కీలకం. బలమైన పార్టీ నిర్మాణానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు …
Read More »