తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి కొత్తగా నిర్మితమవుతున్న కట్టడాలను పరిశీలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సియం కేసీఆర్ సంకల్పంతో యాదగిరిగుట్ట పునఃర్నిర్మాణం …
Read More »రేపు యాదాద్రికి ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణతోపాటు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ కూడా యాదాద్రికి వెళ్తారు. యాదాద్రీశుని దేవాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ నిన్న …
Read More »యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి చేరుకున్నారు. నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థపతి వేలు, ఆనంద్ సాయి, యాడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ …
Read More »యాదాద్రి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి మధ్యాహ్నం 12.22 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వద్ద ముఖ్యమంత్రి దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం రాక సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో భారీ …
Read More »అద్భుతంగా యాదాద్రి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మహాద్భుతంగా, సువిశాలమైన స్థలంలో శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ నగరిలో ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా, భక్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి కొండపై శిల్ప కళాసౌరభంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ క్షేత్రం నిర్మాణాలను 17.32 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇందులో 4.30 ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిప్టు నిర్మించగా, పనులు …
Read More »యాదాద్రికి సాలహార విగ్రహాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయం ద్వితీయ ప్రాకారం వెలుపల సాలహారాల్లో మొత్తం 140 విగ్రహాలను అమర్చాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఏకశిలలతో సాలహార విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మంగళవారం …
Read More »లక్ష్మీనరసింహస్వామికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారి కళ్యాణమహోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి అల్లోల దంపతులకు ఆలయ ఈవో, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా… అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి అల్లోల దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. …
Read More »వరంగల్ హైవేకి పచ్చని అందాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహాదారి త్వరలోనే పచ్చని అందాలతో కనువిందు చేయనున్నది. హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్ విభాగం అధికారులు వరంగల్ జాతీయ రహాదారి మధ్యలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఘట్కెసర్ నుండి యాదాద్రి వరకు నిన్న గురువారం సుమారు ముప్పై కిలోమీటర్ల మేర నేషనల్ హైవే -163వెంట సెంట్రల్ మీడియన్ (2.3మీటర్లు)లో గ్రీనరీ పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్భన్ …
Read More »యాదాద్రిలో తెలంగాణ కొత్త సీఎస్
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమేశ్ కుమార్ ఈ రోజు ఆదివారం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. మొదటిసారిగా యాదాద్రికి వచ్చిన సీఎస్ సోమేశ్ కుమార్ దంపతులకు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వరచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ ఆలయ పునర్నిర్మాణ పనులను …
Read More »యాదాద్రికి రూ.40లక్షల ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉన్న యాదాద్రి గుట్టపై ఉన్న యాదాద్రి దేవస్థానానికి నిన్న ఒక్క రోజే ఆదివారం రూ. 40 లక్షల వరకు ఆదాయం వచ్చింది . నిన్న ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. భక్తులు ఆ మొత్తంలో కానుకలను సమర్పించారు అని ఆలయ ఈఓ గీత తెలిపారు. యాదాద్రి గుట్టపై బాలాలయం నిర్మించిన నాలుగేళ్లల్లో తొలిసారిగా ఇంత …
Read More »