Home / MOVIES / ప‌వ‌న్‌తో పూన‌మ్‌కు సీక్రెట్ ఎఫైర్ ఉందా.. ఇవిగో ప‌క్కా ఆదారాలు..!

ప‌వ‌న్‌తో పూన‌మ్‌కు సీక్రెట్ ఎఫైర్ ఉందా.. ఇవిగో ప‌క్కా ఆదారాలు..!

సినీ క్రిటిక్‌, బిగ్ బాస్‌(తెలుగు) మొద‌టి సీజ‌న్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీవీ ఛానెళ్ల‌ల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే క‌త్తి మ‌హేష్ ఆదివారం మొద‌టిసారిగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్య‌న‌గ‌ర ప‌రిధిలోగ‌ల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది.

సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా కేవ‌లం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనే కాకుండా.. పూన‌మ్ కౌర్‌పై కూడా విరుచుకుప‌డ్డాడు క‌త్తి మ‌హేష్‌. మీడియా స‌మావేశం సాక్షిగా పూన‌మ్‌కౌర్‌కు ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని సంధించారు.

1 .పూనమ్ కౌర్‌కు బ్రాడ్ అంబాసిడర్ పేరు ఎవరి ద్వారా వచ్చింది?

2. తిరుమలలో ప‌వ‌న్‌తో పాటు నిల‌బ‌డీ ఒకే గోత్రంతో పూజ చేసింది నిజం కాదా..?

3. పవన్ మోసం చేశాడనే బాధ‌తో ఆత్మహత్యయత్నం చేసుకుంది నిజం కాదా? అప్పుడు మీరు ఉన్న ఆస్ప‌త్రి ఏంటి? ఆ బిల్లులు క‌ట్టింది ఎవ‌రు?

4.మీ అమ్మను కలిసిన పవన్ ఏం హామీ ఇచ్చారు? ఇప్ప‌టివ‌ర‌కు అది నెర‌వేర్చారా లేదా?

5.డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం…?

6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగంతో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? అక్క‌డ త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి అక్క‌డ మీరేం చేశారో చెప్పండి.

ఈ ప్ర‌శ్న‌ల వ‌ర్షం.. ఇలా ఉండ‌గా.. పూనంకౌర్‌కు సంబంధించిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌లా హ‌ల్ చ‌ల్ చేయ‌డానికి పూన‌మ్ కౌర్ ఫోటోలో ఏముంద‌నేగా మీ డౌట్‌.. ఆ ఫోటోలో ఏమీ లేదు కానీ.. పూన‌మ్ కౌర్ ఎద‌పై మాత్రం ఉంది. అదే ప‌వ‌న్ క‌ల్యాన్ టాటూ. పూన‌మ్ కౌర్ ఎద‌పై ఓ వైపు స్టార్ గుర్తు.. మ‌రో వైపు పీకే అనే రెండు ఇంగ్లీష్ అక్ష‌రాలు ఉన్నాయి. అయితే, పీకే అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అని.. కొంత మంది సినీ జ‌నాలు అంటుండ‌గా… కాదు.. కాదు.. పూన‌మ్ కౌర్ అని మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. పీకే అక్ష‌రాల సంగ‌తి స‌రే.. మ‌రి స్టార్ టాటూ గురించి పూన‌మ్ కౌరే స‌మాధానం ఇవ్వాలి మ‌రీ.