ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరసవిజయాలతో దూసుకుపోతున్న హీరో ఎవరు అంటే వెనక ముందు ఆలోచించకుండా తడుముకోకుండా చెప్పే పేరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .వరస విజయాలతో ఇండస్ట్రీను ఊపేస్తున్న సమయంలో మాటీవీలో ప్రసారమై బిగ్ బాస్ షోతో బుల్లితెరపై కూడా తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు జూనియర్.
తాజాగా త్వరలోనే బిగ్ బాస్ 2 సీజన్ కూడా మొదలవుబోతుంది.అయితే ఈ సీజన్ లో కూడా జూనియర్ ను అడిగితె నో చెప్పాడని వార్తలు వస్తున్నాయి .ఇటివల విడుదలైన జైలవకుశ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న జూనియర్ ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు .
ఈ మూవీ తర్వాత జక్కన్న దర్శకత్వంలో రానున్న మల్టీ స్టారర్ మూవీలో కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది .వరస మూవీలతో బిజీగా ఉండటంతో రెండో సీజన్ కు నో చెప్పడం జూనియర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ కదా ..