ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన సంఘటన ఓటుకు నోటు కేసు.తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ నేత అయిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అప్పట్లో ఎమ్మెల్సీను కొనబోయి అడ్డంగా బుక్ అయిన సంగతి తెల్సిందే.ఈ వ్యవహారం అంతా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలోనే జరిగిందని ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి.అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర లేదని అంటున్నారు రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.బాబు నిర్దోషి.ఈ కేసుకు బాబుకు ఏ మాత్రం సంబంధం లేదని ఆయన తేల్చేశారు.
