తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు.
ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి’ అని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ రిప్లై ఇచ్చారు.
తనను ఎన్నారై అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని.. ఎన్నారైని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేసింది ఏ పార్టీనో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.