Breaking News
Home / 18+ / బాలకృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌దు..నాగబాబు షాకింగ్ కామెంట్

బాలకృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌దు..నాగబాబు షాకింగ్ కామెంట్

మెగా బ్రదర్‌, నటుడు, నిర్మాత,జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల‌కు బాగా దగ్గరైయ్యాడు నాగ‌బాబు సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభుకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.జర్నలిస్ట్ ప్రభు నాగబాబు గారిని బాలయ్య బాబు గురించి చెప్పాలని అడగగా నాకు ఆయనెవరో తెలియదని కామెంట్ చేశారు. ఆ వెంటనే తమాయించుకున్న నాగబాబు.. బాలయ్యగారు పెద్ద ఆర్టిస్ట్. ఆయనను నేనేలా మరిచిపోతాను. నేరము శిక్షలో కృష్ణగారితో కలిసి నటించారని చెప్పారు. అయితే బాలయ్య అంటే నందమూరి బాలకృష్ణ అని యాంకర్ వివరించగా.. తనకు బాలకృష్ణ ఎవరో తెలియదని, ఆయన గురించి తానెప్పుడూ వినలేదని సింపుల్‌గా సమాధానమిచ్చారు నాగబాబు. దీంతో ప్రభు మైండ్ బ్లాంక్ అయింది.

అయితే గ‌తంలో బాల‌కృష్ణ మీడియా అడిగిన ప్రశ్నకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో నాకు తెలియ‌ద‌ని చెప్పారు.దీనికి బ‌దులుగా బాల‌కృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌ద‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చారు నాగ‌బాబు.త‌న పార్టీకి మద్దతుగా నిలిచిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని బాల‌కృష్ణ ఎవ‌రో తెలియ‌ద‌ని అన‌డం చాలా దారుణం అని నాగ‌బాబు తెలిపారు.ఇక ప‌వ‌న్ మూడు పెళ్లిళ్లు గురించి నేను మాట్లాడ‌కూడ‌ద‌ని చెప్పుకొచ్చారు.ప‌వ‌న్ భార్య అంటే మా కుటుంబంలో మనిషిగానే భావిస్తామ‌ని నాగబాబు పెర్కొన్నారు.